200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్‌, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!

Xiaomi 18 Pro Max

Xiaomi 18 Pro Max

Xiaomi 18 Pro Max: షావోమీ నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా Xiaomi 18 Pro Maxను గ్లోబల్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. భారీ డిస్‌ప్లే, అత్యాధునిక 2nm ప్రాసెసర్, 200MP డ్యూయల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా 7,050mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, వెనుకవైపు ప్రత్యేక AMOLED డిస్‌ప్లే ఈ ఫోన్‌లో హైలెట్ గా ఉన్నాయి.

డిస్‌ప్లే

Xiaomi 18 Pro Maxలో 6.9 అంగుళాల M11 12-bit OLED LTPO డిస్‌ప్లేను అందించారు. ఇది 2624 × 1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. HDR10+, Dolby Vision, DC Dimming సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు 2.9 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. నోటిఫికేషన్లు, నావిగేషన్, QR కోడ్స్, ఇతర సమాచారాన్ని వెనుక స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు.

కెమెరాలు

కెమెరా విభాగంలో ఈ మొబైల్ ప్రత్యేకతను చాటుకుంది. లైకాతో కలిసి రూపొందించిన కెమెరా సెటప్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో Light Fusion 960L సెన్సార్, f/1.67 అపర్చర్, Hyper OIS సపోర్ట్ ఉన్నాయి. ఈ సెన్సార్ 16.2EV వరకు డైనమిక్ రేంజ్‌ను అందిస్తుంది. దీనితోపాటు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పెరిస్కోప్ కెమెరాలో Power Prism డిజైన్‌ను ఉపయోగించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అందించారు. వీడియో రికార్డింగ్‌లో 8K, 4K 120fps, Dolby Vision, 10-bit Log సపోర్ట్ ఉన్నాయి. AI ఆధారిత ఫొటో ఎడిటింగ్, పోర్ట్రెయిట్ లైటింగ్, ఆటోమేటిక్ ఫ్రేమింగ్ సూచనలు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రాసెసర్, పనితీరు

ఈ స్మార్ట్ ఫోన్ లో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ప్రాసెసర్‌ను అందించారు. ఇది TSMC 2nm తయారీ ప్రక్రియపై రూపొందించిన చిప్‌సెట్. ఇందులో Oryon ప్రైమ్ CPU కోర్లు గరిష్ఠంగా 5GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తాయి. అప్‌డేటెడ్ Adreno GPU, వేగవంతమైన Hexagon NPU ఉన్నాయి. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు Offset Packaging టెక్నాలజీతో పాటు 3D IceLoop కూలింగ్ వ్యవస్థను అందించారు. ప్రాసెసర్ నుంచి వేడిని వేగంగా బయటకు పంపేందుకు ప్రత్యేక కాపర్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించారు. ర్యామ్ విషయానికి వస్తే 12GB, 16GB LPDDR5X ఆప్షన్లు ఉన్నాయి. స్టోరేజ్ కోసం 256GB, 512GB, 1TB UFS 4.1 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ & ఇతర ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 7,050mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను అందించారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 27W రివర్స్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్ HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో గూగుల్ జెమినీ, Circle to Search, AI ఆధారిత వాయిస్ ప్రాసెసింగ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌క్రిప్షన్, మీటింగ్ సమ్మరీ ఫీచర్లు ఉన్నాయి. ఆడియో కోసం ట్రిపుల్ స్పీకర్ సెటప్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందించారు. కాల్స్ మాట్లాడేటప్పుడు సౌండ్ బయటకు లీక్ కాకుండా నియంత్రించేందుకు ప్రత్యేక అకౌస్టిక్ ఫేజ్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇతర ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Wi-Fi 7, Bluetooth 6.0, UWB, NFC, USB Type-C 3.2 Gen 1 ఉన్నాయి. IP66, IP68, IP69 రేటింగ్స్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.

ధర

ఈ ఫోన్ వెల్వెట్ రెడ్, కాస్మిక్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi 18 Pro Max ధరలు ఇలా ఉన్నాయి..

* 12GB RAM + 256GB స్టోరేజ్ – 1,599 యూరోలు (USD 1,760 / సుమారు రూ.1,64,605).
* 12GB RAM + 512GB స్టోరేజ్ – 1,799 యూరోలు (USD 1,981 / సుమారు రూ.1,85,190).