Xiaomi 18 Pro Launched: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షియోమీ (Xiaomi) మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా అత్యాధునిక ఫీచర్లు, భారీ బ్యాటరీ, 200MP కెమెరా, శక్తివంతమైన కొత్త చిప్‌సెట్‌తో చైనాలో జరిగిన Autumn న్యూ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్లో Xiaomi 18 Proను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఆకట్టుకునే డిస్‌ప్లేతో పాటు వెనుక ప్రత్యేక సెకండరీ స్క్రీన్‌ను కూడా ఇందులో అందించారు.
120Hz LTPO డిస్‌ప్లే
ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల M11 12-bit OLED LTPO డిస్‌ప్లేను అందించారు. ఇది 2436×1220 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 4000 నిట్స్ బ్రైట్‌నెస్, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో 2.7 అంగుళాల 120Hz AMOLED సెకండరీ డిస్‌ప్లే ఉంది. ఇందులో నోటిఫికేషన్లు, విడ్జెట్లు, యాప్ కార్డులు, చిన్న గేమ్స్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. AI ఆధారంగా ఫొటోలతో కస్టమ్ వాల్‌పేపర్లను కూడా రూపొందించుకునే అవకాశం ఉంది.
Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్
మొబైల్ పనితీరు కోసం 2nm తయారీ ప్రక్రియపై రూపొందించిన Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 5.0GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఇందులో Adreno 850 GPU ఉంది. 12GB లేదా 16GB LPDDR5X RAM, 256GB, 512GB లేదా 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
లైకా 200MP ట్రిపుల్ కెమెరాలు
కెమెరాల విషయానికి వస్తే.. ‘లైకా’తో కలిసి రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200MP మెయిన్ కెమెరాతో పాటు 50MP లైకా అల్ట్రావైడ్ కెమెరా, 200MP 5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 12cm వరకు టెలిమ్యాక్రో ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేస్తుంది. 8K, 4K 120fps వీడియో రికార్డింగ్ కూడా ఉన్నాయి.
7000mAh బ్యాటరీ & 100W ఫాస్ట్ ఛార్జింగ్
Xiaomi 18 Proలో 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 27W రివర్స్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌లో HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు Super Xiao Ai 2.0 AI అసిస్టెంట్ అందించారు. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్, NFC, UWB, Wi-Fi 7, Bluetooth 6.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది.
ధర ఎంతంటే?
ఈ మొబైల్ ధర చైనాలో 12GB+256GB వేరియంట్‌కు 5,999 యువాన్ల నుంచి ప్రారంభమవుతుంది. 12GB+512GB ధర 6,999 యువాన్లు, 16GB+512GB ధర 7,999 యువాన్లు, 16GB+1TB ధర 8,999 యువాన్లు. 16GB+1TB Transparent Edition ధర 9,999 యువాన్లు. గ్లోబల్ మార్కెట్లలో ఈ ఏడాది తర్వాత విడుదల చేయనున్నట్లు షియోమీ తెలిపింది.

