200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!

Xiaomi 18 Pro

Xiaomi 18 Pro

Xiaomi 18 Pro: షావోమీ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్ Xiaomi 18 Proను గ్లోబల్ మార్కెట్‌లోకి లాంచ్ అయ్యింది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, లైకా కెమెరాలు, వెనుకవైపు ప్రత్యేక డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా 200MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

డిస్‌ప్లే

ఈ Xiaomi 18 Proలో 6.4 అంగుళాల M11 12-bit OLED LTPO డిస్‌ప్లేను అందించారు. ఇది 2436 × 1220 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పనిచేస్తుంది. 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+, Dolby Vision సపోర్ట్ ఉన్నాయి. స్క్రీన్‌కు Xiaomi Shield Glass రక్షణ కల్పించారు. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 2.7 అంగుళాల AMOLED సెకండరీ డిస్‌ప్లే ఉంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. నోటిఫికేషన్లు, నావిగేషన్, QR కోడ్స్, ఇతర సమాచారాన్ని ఈ స్క్రీన్‌పై చూడవచ్చు. వెనుక కెమెరాలతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు వ్యూఫైండర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

కెమెరాలు

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం Xiaomi 18 Proలో లైకా భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా వ్యవస్థను తీసుకవచ్చారు. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. f/1.67 అపర్చర్, Hyper OIS సపోర్ట్‌తో ఫొటోలు, వీడియోలు మెరుగ్గా క్యాప్చర్ చేయవచ్చు. దీనితోపాటు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. పెరిస్కోప్ కెమెరా 5X ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్‌తో వస్తుంది. 5cm మాక్రో, 12cm టెలీమాక్రో ఫొటోగ్రఫీ ఫీచర్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అందించారు. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే.. 8K వీడియోలు, 4K 120fps రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది. Dolby Vision, 10-bit Log రికార్డింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. AI ఆధారిత ఫొటో ఎడిటింగ్, పోర్ట్రెయిట్ లైటింగ్, ఫ్రేమింగ్ సూచనలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రాసెసర్ & స్టోరేజ్

ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Elite Gen 6 2nm మొబైల్ ప్రాసెసర్‌ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Adreno 850 GPU ఉంది. 12GB, 16GB LPDDR5X ర్యామ్ ఆప్షన్లతో పాటు 256GB, 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ & ఇతర ఫీచర్లు

Xiaomi 18 Proలో 6,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే 27W రివర్స్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ Xiaomi HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. గూగుల్ జెమినీ, Circle to Search, AI ఆధారిత ట్రాన్స్‌క్రిప్షన్, మీటింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. Wi-Fi 7, Bluetooth 6.0, NFC, UWB, USB Type-C 3.2 Gen 1 కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. IP66, IP68, IP69 రేటింగ్స్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉన్నాయి.

ధర

ఈ ఫోన్ వెల్వెట్ రెడ్, కాస్మిక్ బ్లూ, బ్లాక్, వైట్ కలర్ వంటి వివిధ ఆప్షన్లలో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi 18 Pro ధరలు ఇలా ఉన్నాయి..

* 12GB RAM + 256GB స్టోరేజ్ – 1,399 యూరోలు (USD 1,541 / సుమారు రూ.1,44,015).
* 12GB RAM + 512GB స్టోరేజ్ – 1,599 యూరోలు (USD 1,760 / సుమారు రూ.1,64,605).