రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!

  • రూ.8,499 ధరతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్..
  • 1920×1080 పిక్సెల్స్ నేటివ్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్..
  • 4K వీడియో డీకోడింగ్‌కు సపోర్ట్..
  • గరిష్ఠంగా 200 అంగుళాల వరకు ప్రొజెక్షన్..
Xelectron Techno Plus

Xelectron Techno Plus

XElectron Techno Plus: బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్, గేమింగ్‌ను ఆస్వాదించాలనుకునే వారి కోసం XElectron కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. XElectron టెక్నో ప్లస్ ఆండ్రాయిడ్ 14 స్మార్ట్ హోమ్ ప్రొజెక్టర్ పేరుతో లాంచ్ చేసిన ఈ ప్రొజెక్టర్ ధర రూ.8,499గా నిర్ణయించారు. నేటివ్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు 4K వీడియో డీకోడింగ్ సపోర్ట్, 200 అంగుళాల వరకు ప్రొజెక్షన్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

200 అంగుళాల వరకు ప్రొజెక్షన్:

XElectron టెక్నో ప్లస్ ప్రొజెక్టర్‌లో 1920×1080 పిక్సెల్స్ నేటివ్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఉంది. దీంతో కంటెంట్‌ను మెరుగైన క్లారిటీతో వీక్షించవచ్చు. అలాగే 4K వీడియో డీకోడింగ్‌కు కూడా సపోర్ట్ అందిస్తోంది. 9,000 ల్యూమెన్స్ వరకు LED లైట్ సోర్స్, 5,000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియోను ఇందులో అందించారు. ఈ ప్రొజెక్టర్ ద్వారా గరిష్ఠంగా 200 అంగుళాల వరకు స్క్రీన్ సైజ్ పొందవచ్చు. ప్రత్యేకంగా 180 డిగ్రీలు రొటేట్ అయ్యే డిజైన్‌ను అందించడం వల్ల గోడతో పాటు సీలింగ్‌పై కూడా కంటెంట్‌ను ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఆటో కీస్టోన్ కరెక్షన్ ఫీచర్ ఇమేజ్‌ను సరిగ్గా అలైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని LED ల్యాంప్ 50,000 గంటల వరకు పనిచేసేలా రూపొందించారు.

స్మార్ట్ ఫీచర్లు:

XElectron టెక్నో ప్లస్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీంతో ప్రత్యేకంగా ఎక్స్‌టర్నల్ స్ట్రీమింగ్ డాంగిల్ అవసరం లేకుండానే ప్రొజెక్టర్‌ను మీడియా హబ్‌గా ఉపయోగించుకోవచ్చు. నెట్ఫ్లిక్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, జీ5, సోనీలివ్ వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఇందులోనే సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్‌లో 25 భాషలకు సపోర్ట్ అందించారు. ఇందులో హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ వంటి భాషలు కూడా ఉన్నాయి. దీంతో వివిధ ప్రాంతాల వినియోగదారులకు సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

కనెక్టివిటీ కోసం ఇందులో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 6 అందించారు. ఇది 2.4GHz, 5GHz బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. హై-డెఫినిషన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసేటప్పుడు మెరుగైన బ్యాండ్‌విడ్త్, తక్కువ లేటెన్సీ అందించడంలో Wi-Fi 6 ఉపయోగపడుతుంది. అలాగే బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ కూడా ఉంది. దీని ద్వారా సౌండ్‌బార్లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లను ప్రొజెక్టర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎక్స్‌టర్నల్ స్పీకర్ అవసరం లేని సందర్భాల్లో ఉపయోగించుకునేందుకు ఇందులో బిల్ట్-ఇన్ బాస్ స్పీకర్‌ను కూడా అందించారు.

ధర & వారంటీ:

భారత్‌లో XElectron టెక్నో ప్లస్ ఆండ్రాయిడ్ 14 స్మార్ట్ హోమ్ ప్రొజెక్టర్ ధర రూ.8,499గా ఉంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం తయారీదారు వారంటీ అందిస్తున్నారు. ఈ ప్రొజెక్టర్‌ను అమెజాన్ ఇండియా, XElectron అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేయవచ్చు.