Site icon NTV Telugu

WhatsAppలో కీలక అప్‌డేట్‌.. AI ఎంపిక మరింత సులభం..

Whatsapp New Button Feature

Whatsapp New Button Feature

వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌తో యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా మెసేజింగ్ యాప్‌లో ప్రత్యేకంగా Meta AI ట్యాబ్‌ను ప్రవేశపెట్టారు. దీంతో వినియోగదారులు AI ఫీచర్లను నేరుగా యాప్‌లోనే సులభంగా ఉపయోగించుకోవచ్చు.

కొత్త AI ట్యాబ్ ఏమిటి?
ఈ కొత్త ట్యాబ్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్‌లతో AIతో మాట్లాడవచ్చు. అలాగే యానిమేటెడ్ చిత్రాలు సృష్టించడం, ప్రశ్నలకు సమాధానాలు పొందడం వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ అప్‌డేట్ వివరాలను WABetaInfo వెల్లడించింది.
నివేదికల ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోసం విడుదల చేసిన బీటా వెర్షన్‌లో కనిపించింది. ప్రత్యేకంగా Android 2.26.6.5 బీటా వెర్షన్లో ఈ కొత్త AI ట్యాబ్‌ను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఆండ్రాయిడ్ వినియోగదారులతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బీటా టెస్టర్లు దీనిని ఉపయోగిస్తున్నారు.

కమ్యూనిటీస్ ట్యాబ్ స్థానంలో AI
కొత్త అప్‌డేట్‌లో భాగంగా యాప్ దిగువ భాగంలో ఉన్న Communities ట్యాబ్‌ను తొలగించి, దాని స్థానంలో Meta AI ట్యాబ్‌ను తీసుకువచ్చారు. దీని వల్ల AI ఆధారిత చాట్‌లు మరియు ఫీచర్లను ఒకే చోట నుంచి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ భవిష్యత్తులో AI ఆధారిత సేవలను మరింతగా విస్తరించే దిశగా ఈ అప్‌డేట్ కీలకంగా మారనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version