WhatsApp New Feature: వాట్సాప్ సరికొత్త కొత్త ఫీచర్.. బిజినెస్ లావాదేవీల కోసం కోసం ప్రత్యేక విభాగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వ్యాపార సంబంధిత సందేశాలను సులభంగా గుర్తించేందుకు, బిజినెస్ చాట్‌లను ఆటోమేటిక్‌గా ఒక ప్రత్యేక విభాగానికి తరలించే ఫీచర్‌పై సంస్థ పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు ‘ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్’ అనే పేరు పెట్టినట్లు సమాచారం. వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే ప్రముఖ పోర్టల్ వాబెటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న తాజా బీటా అప్‌డేట్‌లో దీన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం వినియోగదారులకు వచ్చే అన్ని సందేశాలు ఒకే చాట్ జాబితాలో కనిపిస్తాయి. అందులో వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్‌లు, బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే సందేశాలు కూడా ఉంటాయి. బిజినెస్ సందేశాలు ఎక్కువైతే అవసరమైన చాట్‌ను కనుగొనడం కష్టంగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని ద్వారా బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే చాట్‌లన్నీ ఆటోమేటిక్‌గా ఒక ప్రత్యేక జాబితాలోకి వెళ్లిపోతాయి. దీంతో యూజర్లు వ్యాపార చాట్‌లను ఒకే చోట సులభంగా చూడగలుగుతారు.
Also Read
- 144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
24 గంటల తర్వాత ప్రత్యేక విభాగానికి
నివేదికల ప్రకారం, బిజినెస్ ఖాతాల నుంచి వచ్చిన సందేశాలు 24 గంటల తర్వాత ప్రత్యేక బిజినెస్ విభాగానికి తరలించబడే అవకాశం ఉంది. అయితే, ఏ చాట్‌లు ప్రధాన చాట్ లిస్టులో ఉండాలి, ఏవి వేరే విభాగానికి వెళ్లాలి అనే ఎంపికను యూజర్లకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
స్పామ్ తగ్గించే అవకాశం
ఈ ఫీచర్ వల్ల అవసరం లేని ప్రమోషనల్ మెసేజులు, బిజినెస్ నోటిఫికేషన్లు ప్రధాన చాట్‌లను డిస్టర్బ్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. స్పామ్ మెసేజులు తగ్గడమే కాకుండా, వ్యక్తిగత చాట్‌లను మరింత క్రమబద్ధంగా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది.
ఇంకా అభివృద్ధి దశలోనే
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉందని, ఇంకా అధికారికంగా విడుదల కాలేదని సమాచారం. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చి, అనంతరం సాధారణ వినియోగదారులకు విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా, వాట్సాప్ తరచూ యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే కొత్త ఫీచర్లను తీసుకొస్తుండగా, ఈ బిజినెస్ చాట్ మేనేజ్‌మెంట్ ఫీచర్ కూడా ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశముంది.
WhatsApp is working on automatic separation of business chats to reduce spam!
WhatsApp is reportedly working on a feature to automatically organise business chats into a separate section on Android.https://t.co/0WBmxuYys4 pic.twitter.com/Or6cZRvg6x
— WABetaInfo (@WABetaInfo) April 15, 2026
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!