NTV Telugu Site icon

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక క్షణాల్లో..!

Whatsapp

Whatsapp

‘వాట్సాప్’ దాదాపు ఈ సోషల్‌ మీడియా యాప్‌ తెలియనివారు ఉండరు అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు.. అంతలా అందరి జీవితాల్లో ఇది భాగమైపోయింది.. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉందంటే.. దాంట్లో వాట్సాప్‌ ఉండాల్సిందే.. టెస్ట్‌, వీడియోలు, ఫైల్స్‌, లింక్‌లు, ఫొటోలు.. వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌.. ఇలా అనేక ఫీచర్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ కాలంలోనే అందరి అభిమానాన్ని చురగొంది. ఇక, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు.. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి వివిధ మార్గాలను పరీక్షిస్తోంది.. మెసేజింగ్ యాప్ చాట్ ఫిల్టర్‌లలో పని చేస్తున్నట్లు కనుగొంది.. ఇది వినియోగదారులను సులభంగా మరియు వేగంగా చాట్‌లను కనుగొనేలా చేయనుండడంతో.. చాట్‌ ఫిల్టర్‌ అనే ఫీచర్‌ తీసుకొస్తుంది.

అయితే, చాట్ ఫిల్టర్ ఫీచర్ ఇప్పటికే వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్లలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వ్యాపారేతర ఖాతాలకు కూడా పరిచయం చేసేందుకు సిద్ధమైంది వాట్సాప్‌.. ఈ మధ్యే వాట్సాప్‌ 2 జీబీ వరకు ఫైల్‌లను బదిలీ చేసే సామర్థ్యం, ఎమోజి ప్రతిచర్యలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా సమాచారం ప్రకారం.. వాట్సాప్‌ ఆన్‌ రైడ్‌, ఐఎస్‌వో మరియు డెస్క్‌టాప్‌ కోసం వ్యాపార ఖాతాల కోసం అధునాతన చాట్‌ ఫిల్టర్‌ను రూపొందించింది. చాట్‌లను త్వరగా వెతకడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది.. త్వరలోనే వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

వాట్సాప్‌లో చదవని చాట్‌లు, కాంటాక్ట్‌లు, నాన్-కాంటాక్ట్‌లు మరియు సమూహాల కోసం శోధించడాన్ని సులభతరం చేయనుంది చాట్‌ ఫిల్టర్.. ప్రైమరీ WhatsApp అకౌంట్లలో కూడా యాప్ ఫీచర్ అప్ డేట్ తీసుకురాబోతోంది. ఈ ఫిల్టర్ బటన్ మీరు చాట్‌లను మెసేజ్‌ల కోసం సెర్చ్ చేసినప్పుడు కూడా కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. చాట్ ఫిల్టర్ ఫీచర్.. డెస్క్‌టాప్‌లో WhatsApp బీటాలో కనిపించింది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో.. ఆండ్రాయిడ్ iOSలోని బీటా టెస్టర్‌ల కోసం WhatsApp ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, రెండు వారాల క్రితమే వాట్సాప్‌ బీటా UWP 2.2216.4.0 వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన యూజర్లకు అందుబాటులో ఉందని నివేదికలు చెబుతున్నాయి.