Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
- వివో X300e
- 7200mAh బ్యాటరీ
- 6.59-అంగుళాల 1.5K OLED డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివో తన X300 సిరీస్‌లో మరో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300e 5Gను ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ Vivo X300, Vivo X300 Pro మోడళ్లను మార్కెట్లోకి తీసుకురాగా, ఇప్పుడు X300eతో సిరీస్‌ను మరింత విస్తరించింది. 7200mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, ZEISS కెమెరా సిస్టమ్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది.
Vivo X300e 5G లభ్యత
Vivo X300e కోసం కంపెనీ ప్రీ-ఆర్డర్లను అధికారికంగా ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ జూలై 27 ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం ఫోన్ ధరను కంపెనీ ప్రకటించలేదు. సేల్ ప్రారంభానికి ముందు అధికారిక ధరను వెల్లడించే అవకాశం ఉంది.
Also Read
- Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
- 108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
6.59-అంగుళాల 1.5K OLED డిస్ప్లే
Vivo X300eలో 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లేను అందించారు. మెరుగైన విజువల్ అనుభవం, ప్రకాశవంతమైన రంగులు, సున్నితమైన టచ్ రెస్పాన్స్‌తో ఈ డిస్ప్లే వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.
Snapdragon 8 Gen 5 ప్రాసెసర్
పనితీరు కోసం ఈ ఫోన్లో Qualcomm Snapdragon 8 Gen 5 ఫ్లాగ్షిప్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. హై-ఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఆధారిత పనులను వేగంగా నిర్వహించే సామర్థ్యం ఈ ప్రాసెసర్‌కు ఉంది.
50MP ZEISS ట్రిపుల్ కెమెరా
ఫోటోగ్రఫీ కోసం Vivo X300eలో ZEISS ఇమేజింగ్ టెక్నాలజీతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP IMX పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. ఈ కెమెరా వ్యవస్థ మెరుగైన రంగులు, అద్భుతమైన జూమ్ క్వాలిటీని అందించేందుకు రూపొందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు.
7200mAh భారీ బ్యాటరీ
ఈ ఫోన్లోని ప్రధాన ఆకర్షణ 7200mAh భారీ బ్యాటరీ. దీని ద్వారా ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ప్రీమియం డిజైన్
భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ Vivo X300e మందం కేవలం 7.99mm మాత్రమే. ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ తో పాటు ఎడమ వైపున చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను అందించారు. అదనంగా అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
తాజావార్తలు
-
Honey Trap: బిటెక్ డ్రాపౌట్.. కానీ చేసేది ప్రైవేట్ ఫొటోలతో బెదిరింపులు..
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!