Site icon NTV Telugu

120Hz రిఫ్రెష్ రేట్, 50MP రియర్ కెమెరా, వైర్ లెస్ ఛార్జింగ్తో Vivo X200T

Vivo

Vivo

Vivo X200T: వివో నుంచి కొత్త సబ్-ఫ్లాగ్‌షిప్ ఫోన్ Vivo X200T ఊహించిన దానికంటే త్వరగా భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫోన్‌ జనవరి చివర్లో లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సమాచారం. కంపెనీ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ, ఇటీవల వచ్చిన సర్టిఫికేషన్‌ లిస్టింగ్స్‌ ఫోన్‌ విడుదల దగ్గరలోనే ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి.

Read Also: TheRajaSaab : ఇది రెబెల్ స్టార్ రేంజ్.. భారత ఏకైక నటుడుగా రికార్డ్

ధర
Vivo X200T ధర భారత్‌లో రూ. 50,000 – రూ. 55,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఈ ధర సెగ్మెంట్‌ ఫోన్‌ను ఎంట్రీ-లెవల్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో నిలబెడుతోంది. లాంచ్‌ సమయంలో ఈ ఫోన్‌ కనీసం Stellar Black, Seaside Lilac అనే రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

‘T’ బ్రాండింగ్‌లో ప్రత్యేకత
Vivo X సిరీస్‌లో ఇప్పటి వరకు T suffix ఉన్న ఫోన్‌ లేదు. X సిరీస్‌లో X300, X300 Pro, X200 Ultra, X200s, X200 Pro Mini, X200 FE, X200 FE వంటి మోడల్స్‌ ఉన్నాయి.. X familyలో T branding రావడం ఇదే తొలిసారి. సాధారణంగా Vivoలో T-series మిడ్-రేంజ్ లేదా బడ్జెట్ సెగ్మెంట్‌కే పరిమితం. కానీ ఇప్పుడు X flagship lineupలో T branding ఉపయోగించడం Vivo తీసుకున్న కొత్త వ్యూహంగా కనిపిస్తోంది.

Read Also: Motorola Razr Fold Launch: మోటరోలా నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్.. 8.1 ఇంచెస్ డిస్‌ప్లే, 50MP కెమెరా, బిగ్ బ్యాటరీ!

X200 FEకి రీబ్రాండ్‌?
ఈ ఫోన్‌ Vivo X200 FEకి రీబ్రాండ్‌ వెర్షన్ అయ్యే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో X200 FE భారత్‌లో జూలై 2025లో లాంచ్‌ అయింది.

12GB + 256GB ధర ₹54,999
16GB + 512GB ధర ₹59,999 గా విడుదలైంది. ఒకవేళ వివో X200Tని ఇంకాస్త తక్కువ ధరకు లాంచ్ చేసి, core hardware అలాగే ఉంచితే, FE కంటే మంచి ఆప్షన్‌గా నిలిచే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది.

స్పెసిఫికేషన్స్ & ఫీచర్స్
* డిస్‌ప్లే: 6.67-అంగుళాల AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్
* కెమెరా: Zeiss ట్యూన్డ్ ట్రిపుల్ 50MP రియర్ కెమెరా
* నేచురల్ కలర్స్‌, మెరుగైన పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం ఆప్టిమైజ్‌

ప్రాసెసర్:
* MediaTek Dimensity 9000 series
* Dimensity 9400+ చిప్‌ ఉండే ఛాన్స్..
* ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరు
* ఫింగర్‌ప్రింట్: 3D Ultrasonic సెన్సార్
* Vapor Chamber Cooling

చార్జింగ్:

* 90W Wired Fast Charging
* 40W Wireless Charging

కాగా, కెమెరా క్వాలిటీ, ఫాస్ట్‌ చార్జింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజర్లకు Vivo X200T మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. అయితే, Vivo X200T ఇప్పటికే BIS India లిస్టింగ్‌లో V2561 model numberతో కనిపించింది. దీని ఆధారంగా ఫోన్‌ జనవరి చివర్లో లాంచ్‌ అయ్యే కావడం పక్కా అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఫోన్ ధర సుమారు ₹50,000 రేంజ్‌లో ఉంటే.. దీనికి ప్రధాన పోటీగా నిలిచే మోడల్స్‌:
* OnePlus 15R (upcoming)
* OPPO Reno15 series
* Vivo’s own V-series phones
* OPPO Reno15 lineup

Exit mobile version