మీరు ప్రస్తుతం శక్తివంతమైన కెమెరా, పెద్ద బ్యాటరీ, ప్రీమియం డిజైన్ కలిగిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే ఇదే మంచి అవకాశం. వివో వీ50 (Vivo V50 5G) మంచి ఎంపిక కావచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ డీల్ కూడా అందుబాటులో ఉన్నాయి. అడ్డు డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
వివో వీ50 5G (8జీబీ + 128జీబీ) భారతదేశంలో రూ.39,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.32,999కి లభిస్తుంది. అంటే మీకు 17 శాతం (రూ.7,000 తగ్గింపు) తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ లేదా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు అదనంగా 5 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ అనంతరం వివో వీ50 ధర రూ.28,999కి తగ్గుతుంది. మొత్తంగా మీకు రూ.11 వేల తగ్గింపు లభిస్తుంది.
వివో వీ50 5Gపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్‌పై మీరు రూ.26,650 వరకు పొందవచ్చు. అయితే మీ పాత లేటెస్ట్ మోడల్ అయి ఉండి.. మంచి కండిషన్లో ఉంటేనే పూర్తి ఎక్స్‌ఛేంజ్ వస్తుంది. ఒకవేళ పూర్తి ఎక్స్‌ఛేంజ్ దక్కితే.. మీకు వివో వీ50 5G ఫోన్ దాదాపుగా 3 వేలకు సొంతమవుతుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకునే వారు త్వరగా కొనేసుకుంటే బెటర్.
Also Read: MS Dhoni: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2028లో కూడా ఎంఎస్ ధోనీ!
వివో వీ50 ఫీచర్లు:
# 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్ రేటు, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్
# ఫన్‌టచ్ ఓఎస్ 15
# 50 ఎంపీ ప్రధాన కెమెరా + 50 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్
# ముందు వైపు 50 ఎంపీ కెమెరా
# 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
# ఐపీ 68, ఐపీ 69 రేటింగ్
