Site icon NTV Telugu

10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!

Vivo Pad 5e

Vivo Pad 5e

Vivo Pad 5e: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వివో (Vivo) తాజాగా తన కొత్త టాబ్లెట్ Vivo Pad 5eను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Pad 5, Pad 5 Pro మోడళ్లకు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త Vivo Pad 5e 12.1 అంగుళాలపెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. ఇది Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో నడుస్తుంది. బ్లూ, బ్లాక్, పర్పుల్ కలర్ వేరియంట్‌లలో ఈ టాబ్లెట్ లభిస్తుంది. అలాగే “సాఫ్ట్ లైట్” వెర్షన్ మాత్రం బ్లూ, బ్లాక్ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ టాబ్లెట్ చైనాలో అక్టోబర్ 17 నుంచి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి రానుంది.

Astrology: అక్టోబర్‌ 14, మంగళవారం దిన ఫలాలు.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..?

Vivo Pad 5eలో ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5 ఉంది. ఇందులో 12.1 ఇంచుల డిస్‌ప్లేకు 2.8K రిజల్యూషన్, గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇందులోని Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌కు గరిష్టంగా 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేయబడింది. బేస్ వేరియంట్‌లో LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఆడియో విభాగంలో ఫోర్-స్పీకర్ పానోరమిక్ అకౌస్టిక్ సెటప్ తో వస్తుంది. వీటితోపాటు AI ట్రాన్స్క్రిప్షన్, సర్కిల్ టు సెర్చ్, AI PPT అసిస్టెంట్, మల్టీ స్క్రీన్ ఇంటర్‌కనెక్షన్, స్మాల్ విండో కొలాబరేషన్, వైర్‌లెస్ ప్రింటింగ్ వంటి పలు స్మార్ట్ AI ఫీచర్లను కూడా ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా పరంగా చూసుకుంటే, వెనుక భాగంలో 8MP సింగిల్ రియర్ కెమెరా, ముందువైపున 5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇది 10,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 44W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ పర్ణగా చూస్తే Wi-Fi 6, బ్లూటూత్ 5.4 సదుపాయాలు ఉన్నాయి. ఫేస్ రికగ్నిషన్ ద్వారా బయోమెట్రిక్ అన్‌లాక్ సదుపాయం కూడా అందించారు. టాబ్లెట్ 266.43×192×6.62mm సైజు ఉండగా, బరువు సుమారు 584 గ్రాములుగా ఉంది.

Telangana : రేవంత్‌ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం

ధర పరంగా చూస్తే Vivo Pad 5e బేస్ మోడల్ అయిన 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 (రూ. 25,000). అలాగే 8GB + 256GB వేరియంట్ CNY 2,299 (రూ. 29,000), 12GB + 256GB వేరియంట్ CNY 2,599 (రూ. 32,000), ఇక టాప్ వేరియంట్ 16GB + 512GB ధర CNY 2,999 (రూ. 37,000)గా ఉంది. “సాఫ్ట్ లైట్” ఎడిషన్ మాత్రం CNY 2,199 (రూ. 27,000), CNY 2,499 (రూ. 31,000)లలో లభిస్తుంది.

Exit mobile version