Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Truecaller Scam Checker: టెక్నాలజీ పెరగడంతో పాటు మోసాలు చేసే పద్ధతి కూడా మారిపోయింది.. ఏ లింక్ క్లిక్ చేస్తే ఏమి అవుతుందో కూడా తెలియని పరిస్థితి.. ఇక, ఏ నంబర్ మాటును.. ఏ క్రైమ్ పొంచిఉందో అనే ఆందోళన కూడా అందరినీ వెంటాడుతోంది.. అయితే, ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ లింకులు, అనుమానాస్పద ఫోన్ నంబర్లను ముందుగానే గుర్తించేందుకు ప్రముఖ కాలర్ ఐడీ ప్లాట్‌ఫామ్ Truecaller కొత్త Scam Checker ఫీచర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24న ప్రారంభమైన ఈ సేవ ద్వారా అనుమానాస్పద లింకులు, ఫోన్ నంబర్లు, మెసేజ్‌లను ఒకే చోట చెక్ చేసుకోవచ్చు.
Scam Checker ఎలా పనిచేస్తుంది?
ఏదైనా అనుమానాస్పద వెబ్ లింక్ వస్తే దాన్ని Scam Checkerలో పేస్ట్ చేసి అది ఫిషింగ్ ప్రయత్నమా కాదా తెలుసుకోవచ్చు. అలాగే అనుమానం ఉన్న ఫోన్ నంబర్‌ను చెక్ చేస్తే Truecaller డిటెక్షన్ టెక్నాలజీతో పాటు యూజర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన రిపోర్టులను కూడా పరిశీలించి వివరాలను అందిస్తుంది. ఈ సేవలో ‘Scamfeed’ అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. ఇతర యూజర్లు రిపోర్ట్ చేసిన స్కామ్‌లను ఇందులో చూడొచ్చు. దీంతో ప్రస్తుతం ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అనుమానాస్పద ఘటనను యూజర్లు తమ మాటల్లో వివరించి రిపోర్ట్ చేయవచ్చు. చెక్ చేసిన నంబర్, లింక్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఇలాంటి ఘటనలపై వచ్చిన కమ్యూనిటీ రిపోర్టులను కూడా Scam Checker చూపిస్తుంది.
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ఇప్పటివరకు నంబర్‌ను గుర్తించడం, స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయడానికే పరిమితమైన Truecaller.. ఇప్పుడు ఫోన్ నంబర్, లింక్, వాటి వెనుక ఉన్న అనుమానాస్పద కథనం వంటి మూడు అంశాలను ఒకే చోట పరిశీలించేలా Scam Checkerను రూపొందించింది. సుమారు 500 మిలియన్ యూజర్ల కమ్యూనిటీ నుంచి వచ్చే సమాచారం కూడా ఈ సేవకు కీలకంగా ఉండనుంది. అంతేకాదు.. Truecaller భవిష్యత్తులో మరిన్ని భద్రతా ఫీచర్లను తీసుకురావడానికి పనిచేస్తోంది. ఇందులో భాగంగా స్క్రీన్షాట్లను అప్లోడ్ చేసి స్కామ్ వివరాలను పరిశీలించే ఫీచర్‌ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. Truecaller CEO రిషిత్ ఝుంఝున్వాలా మాట్లాడుతూ.. ఏదో తప్పుగా ఉందని ప్రజలు గుర్తించినప్పుడు, వెంటనే స్పందించే ముందు వేగంగా చెక్ చేసుకునే అవకాశం అవసరమని తెలిపారు. ప్రస్తుతం Scam Checker వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. భారత్‌లో Android యాప్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ Android యాప్‌కు తీసుకురానున్నారు. అయితే iOS వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై Truecaller ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!