Site icon NTV Telugu

CNAP Service: ఇంటర్నెట్ అవసరం లేదు.. యాప్‌తో పని లేదు.. ఫోన్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా కాలర్ పేరు

Trai

Trai

CNAP Service: ఇటీవల ట్రాయ్ (TRAI) వినియోగదారుల కోసం ఒక కొత్త సేవను ప్రారంభించింది. దీనిని కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అంటారు. ఈ సేవ ద్వారా కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే నంబర్‌తో పాటు పేరు సైతం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంటే ఇకపై కాల్ వచ్చినప్పుడు నంబర్ మాత్రమే కాదు.. ఆ నంబర్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో కనిపిస్తుంది. ఈ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన పనీ లేదు. సబ్‌స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. అన్ని మొబైల్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుతుంది. ప్రస్తుతం మీ ఫోన్‌లో ఈ ఫీచర్ కనిపించకపోతే, రాబోయే రోజుల్లో ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుంది. చాలా మంది దీనిని ట్రూకాలర్‌లాంటి సేవగా భావిస్తున్నారు. కానీ CNAP, ట్రూకాలర్ రెండూ వేరు వేరు. వీటికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి.

READ MORE: AUS vs ENG 5th Test: ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. 277 వికెట్లు తీసిన బౌలర్ అరంగేట్రం!

CNAP ఎలా పనిచేస్తుంది?
CNAP కాల్ చేసే వ్యక్తి మొబైల్ నంబర్ ఏ పేరుతో అధికారికంగా రిజిస్టర్ అయిందో అదే పేరును చూపిస్తుంది. ఉదాహరణకు, మీ మొబైల్ నంబర్ మీ తండ్రి లేదా తల్లి పేరుతో తీసుకుని ఉంటే, మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు వారి ఫోన్‌లో మీ నంబర్‌తో పాటు వారి పేరు కనిపిస్తుంది. అయితే, ఎవరి ఫోన్‌లో మీ నంబర్ ఇప్పటికే సేవ్ అయి ఉంటే, వారు సేవ్ చేసిన పేరే అక్కడ కనిపిస్తుంది. రిజిస్టర్డ్ పేరు కనిపించదు. ఈ సేవ నెట్‌వర్క్ లెవెల్‌లో నేరుగా టెలికాం కంపెనీల సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. టెలికాం ఆపరేటర్ల దగ్గర ప్రతి మొబైల్ నంబర్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అంటే ఆ నంబర్ ఎవరి పేరుతో ఉంది, KYC వివరాలు, తదితర సమాచారం వాళ్ల వద్ద ఉంటుంది. ఎవరైనా కాల్ చేసినప్పుడు, ఆ నంబర్ రిజిస్టర్ అయిన పేరును నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా రిసీవర్‌కు చూపిస్తుంది. ప్రస్తుతం ఈ సేవ 4G, 5G నెట్‌వర్క్‌లపై పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో పాత మొబైల్ మోడల్స్‌లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

READ MORE: LG Gram Laptop: ప్రపంచంలోనే అత్యంత తేలికైనది.. 17-అంగుళాల LG గ్రామ్ ల్యాప్‌టాప్ ఆవిష్కరణ..

Exit mobile version