Wired Earphones: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతిక ప్రపంచంలో మార్పులు చాలా వేగంగా జరుగుతుంటాయి. ఒకప్పుడు వైర్లతో కూడిన హెడ్‌ఫోన్లు వాడటం ఇబ్బందిగా అనిపించి, అందరం వైర్‌లెస్ (Bluetooth) వైపు పరుగులు తీశాం. స్మార్ట్‌ఫోన్ల నుంచి హెడ్‌ఫోన్ జాక్ తొలగించడంతో వైర్డ్ హెడ్‌ఫోన్ల యుగం ముగిసిందని అందరూ భావించారు. కానీ, ఆశ్చర్యకరంగా టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నా, వినియోగదారులు మళ్లీ పాత కాలపు వైర్డ్ హెడ్‌ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సౌండ్ క్వాలిటీ, భద్రత కారణంగా ఇవి ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి.
మారిన టెక్ ప్రపంచం..
Also Read
- HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
2016లో యాపిల్ సంస్థ తన ఫోన్ల నుంచి హెడ్‌ఫోన్ జాక్‌ను తొలగించి పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు కూడా అదే దారిలో నడిచాయి. దీంతో బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్ వాడకం అనివార్యమైంది. అయితే.. 2025 చివరి నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. గణాంకాల ప్రకారం.. 2026 ప్రారంభంలోనే వైర్డ్ హెడ్‌ఫోన్ల అమ్మకాలు 20 శాతం మేర పెరగడం విశేషం. ఇది కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే కాదు, వినియోగదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుగా నిపుణులు భావిస్తున్నారు.
వైర్డ్ హెడ్‌ఫోన్ల ప్లస్ పాయింట్లు..
వైర్డ్ హెడ్‌ఫోన్లకు ఉన్న ప్రధాన బలం వాటి సౌండ్ క్వాలిటీ. బ్లూటూత్ హెడ్‌ఫోన్లతో పోలిస్తే తక్కువ ధరలోనే ఇవి అద్భుతమైన ఆడియో అనుభూతిని ఇస్తాయి. వీటిలో బ్యాటరీ ఛార్జింగ్ సమస్య ఉండదు, కనెక్షన్ కట్ అయ్యే ప్రమాదం ఉండదు. ప్లగ్ చేస్తే చాలు, వెంటనే వాడుకోవచ్చు. ప్రస్తుతం సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వైర్డ్ హెడ్‌ఫోన్లతో కనిపించడం ఒక కొత్త ఫ్యాషన్‌గా మారింది. బ్లూటూత్ కన్నా వైర్డ్ వాడటమే ఇప్పుడు “కూల్” అని యువత భావిస్తోంది.
బ్లూటూత్ హెడ్‌ఫోన్ల వాడకంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే హ్యాకింగ్ చేయడం సులభమని, ప్రైవసీకి భంగం కలుగుతుందని చాలామంది భయపడుతున్నారు. అలాగే.. బ్లూటూత్ రేంజ్ పరిమితంగా ఉండటం, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ల వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం వంటివి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సేఫ్టీ పరంగా, క్వాలిటీ పరంగా ‘ఓల్డ్ ఫ్యాషన్’ వైర్డ్ హెడ్‌ఫోన్లే మేలని వినియోగదారులు నిర్ణయించుకుంటున్నారు.
అధిక టెక్నాలజీ వల్ల కలిగే ఒత్తిడి నుంచి దూరంగా ఉండి, సహజమైన అనుభూతిని పొందాలని చాలామంది కోరుకుంటున్నారు. అందుకే హెడ్‌ఫోన్లే కాదు.. పాత కాలపు క్యాసెట్లు, డీవీడీలు, టైప్‌రైటర్లు కూడా మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. క్వాలిటీ , సింప్లిసిటీని కోరుకునే వారంతా మళ్ళీ ఓల్డ్ టెక్నాలజీనే ఇష్టపడుతున్నారు. మొత్తానికి వైర్డ్ హెడ్‌ఫోన్ల యుగం మళ్లీ మొదలైందని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!