TECNO Spark Go 3: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించే ప్రముఖ బ్రాండ్ టెక్నో (TECNO) భారత మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది విడుదలైన స్పార్క్ గో 2 విజయవంతం కావడంతో దానికి కొనసాగింపుగా స్పార్క్ గో 3 (TECNO Spark Go 3)ని జనవరి 16న విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
టెక్నో ఈ ఫోన్‌ను “దేశ్ జైసా దమ్దార్” (దేశం లాగే దృఢమైనది) అనే థీమ్‌తో ప్రమోట్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక విలాసవంతమైన వస్తువులా కాకుండా సామాన్యుల దైనందిన జీవితంలో ఒక నమ్మకమైన సాధనంగా ఉండాలని కంపెనీ దీనిని రూపొందించింది. నిరంతరం శ్రమించే భారతీయుల మనస్తత్వానికి తగ్గట్టుగా ఎక్కడా ల్యాగ్ (Lag) లేకుండా రోజంతా పని చేసే సామర్థ్యం దీనికి ఉందని టెక్నో పేర్కొంది.
సాధారణంగా బడ్జెట్ ఫోన్లలో కనిపించని కొన్ని ప్రత్యేక రక్షణ ఫీచర్లను స్పార్క్ గో 3 లో టెక్నో పొందుపరిచింది. ఈ ఫోన్ ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ కల్పించే IP64 రేటింగ్ తో వస్తుంది. దీనివల్ల ప్రమాదవశాత్తు ఫోన్‌పై నీళ్లు పడినా లేదా దుమ్ము చేరినా ఫోన్ పాడవకుండా సురక్షితంగా ఉంటుంది. ఇంకా పగుళ్లు, పొరపాటున పడే గీతలను తట్టుకునేలా దీని నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. పర్యావరణంలోని మార్పులను తట్టుకుని, ఎక్కువ కాలం మన్నికనిచ్చేలా దీనిని తీర్చిదిద్దారు.
Deputy CM Pawan Kalyan: మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తులతో జాగ్రత్త.. పవన్ కీలక సూచనలు..
టెక్నో స్పార్క్ గో 3 జనవరి 16న అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. లాంచ్ అయిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ధర, మిగితా స్పెక్స్ లాంచ్ రోజు తెలియనున్నాయి.
