Site icon NTV Telugu

నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

Tecno Spark 50 5g

Tecno Spark 50 5g

TECNO Spark 50 5G Launch: టెక్నో (TECNO) సంస్థ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ లో భాగంగా టెక్నో స్పార్క్ 50 5జీ ఫోన్‌ (TECNO Spark 50 5G) ను భారతదేశంలో మార్చి 27న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌ కొత్త డిజైన్‌తో రానుంది. ఫోన్ వెనుక భాగంలో పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఈ ఫోన్ ఫాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్, ఇంక్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయంలో అసలు రాజిపడలేదు. ఇది మిలిటరీ గ్రేడ్ టెస్టింగ్ (ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ సర్టిఫికేషన్) పొందినట్లు కంపెనీ ప్రకటించింది.

ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళల ఆధిపత్యం.. 2వ స్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధానా.!

“పవర్ కా తషన్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్ భారీ 6500 mah బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీకి 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్పార్క్ 50 5జీ ఫోన్‌లో పలు ప్రత్యేక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో వేగవంతమైన డేటా డౌన్‌లోడ్ మరియు స్థిరమైన నెట్‌వర్క్ కోసం 4×4 మిమో సపోర్ట్, ఇంకా “యూపీఎస్ 3.0 సిగ్నల్ బూస్టింగ్ టెక్నాలజీ” ద్వారా NFC ద్వారా యూపీఐ చెల్లింపులు మరింత వేగంగా, విశ్వసనీయంగా చేయగలుగుతారు. అలాగే సెల్యులార్ టవర్స్ లేదా వై-ఫై లేకుండానే నెట్‌వర్క్ లేకుండా కమ్యూనికేషన్ చేసే టెక్నాలజీని పొందుపరిచారు.

Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్‌లో మన సినిమాలదే హవా!

ఈ ఫోన్‌లో Techno Ella ఏఐ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. ఇది బహుభాషా అనువాదం, వాయిస్ కమాండ్స్‌ కు మద్దతు ఇస్తూ భారతీయ ప్రాంతీయ భాషలకు అనుకూలంగా పనిచేస్తుంది. ఈ టెక్నో స్పార్క్ 50 5జీ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు ఈ మార్చి 27న తెలియనున్నాయి.

Exit mobile version