లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!

  • టెక్నో తొలిసారిగా Tonino Lamborghiniతో కలిసి ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్..
  • బ్లాక్, రెడ్ కలర్ థీమ్‌తో ప్రీమియం లుక్‌..
  • Tecno Pova 8 Pro 5G Tonino Lamborghini Limited Edition లాంచ్..
Tecno Pova 8 Pro 5g Tonino Lamborghini Limited Edition

Tecno Pova 8 Pro 5g Tonino Lamborghini Limited Edition

Tecno Pova 8 Pro 5G Tonino Lamborghini Edition: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టెక్నో (Tecno) కొత్త ప్రీమియం ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇటాలియన్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ Tonino Lamborghiniతో కలిసి కంపెనీ తొలిసారిగా రూపొందించిన Tecno Pova 8 Pro 5G Tonino Lamborghini Limited Editionను లాంచ్ చేసింది. బ్లాక్, రెడ్ కలర్ కాంబినేషన్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

Lamborghini డిజైన్‌:

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను టోనినో లాంబోర్గిని బ్లాక్ కలర్‌లో అందించారు. వెనుక ప్యానెల్‌పై బ్లాక్, రెడ్ రంగులతో హెక్సాగన్ ప్యాటర్న్‌ను ఉపయోగించారు. మధ్యలో పల్స్ లైన్, దాని చుట్టూ లైట్‌ను ప్రతిబింబించేలా ఇంటర్నల్ మిర్రర్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో టోనినో లాంబోర్గిని లోగోను ప్రీమియం మెటాలిక్ ఫినిష్‌తో అందించారు. ఫోన్‌లోని అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లేపై ప్రత్యేకమైన ‘L’ సిగ్నేచర్ ను కూడా పొందుపరిచారు. దీంతో సాధారణ పోవా సిరీస్ ఫోన్‌లతో పోలిస్తే ఈ మోడల్‌కు ప్రత్యేకమైన లగ్జరీ లుక్ లభించింది.

AMOLED డిస్‌ప్లే:

ఈ లిమిటెడ్ ఎడిషన్ లో 6.78 అంగుళాల HyperLux AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 2,644×1,208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు గరిష్ఠంగా 144Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. 429ppi పిక్సెల్ డెన్సిటీ, 93.18 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి. డిస్‌ప్లే గరిష్ఠంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను అందించారు.

ప్రాసెసర్ & కెమెరా:

పనితీరు కోసం ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో MediaTek Dimensity 7400 Ultimate 5G చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Arm Mali-G615 MC2 GPU ఉంది. గరిష్ఠంగా 12GB RAM, 512GB స్టోరేజ్‌ను పొందవచ్చు. RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా మెమరీని 24GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony LYT-700C ప్రధాన కెమెరాతో పాటు OIS సపోర్ట్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. కెమెరా మాడ్యూల్‌లోనే అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేను అందించారు. దీన్ని వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంటుంది.

భారీ బ్యాటరీ:

ఈ ఫోన్‌లో 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, NFC, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే GLONASS, BeiDou, Galileo సపోర్ట్ కూడా ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో పాటు యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర:

ఈ కొత్త Tecno Pova 8 Pro 5G Tonino Lamborghini Limited Edition ధర, లభ్యత వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్‌లోని హార్డ్‌వేర్ ఫీచర్లు సాధారణ Pova 8 Pro 5Gకి దగ్గరగా ఉన్నాయి. భారత మార్కెట్లో Pova 8 Pro 5G గత నెలలో రూ.49,999 ప్రారంభ ధరతో విడుదలైంది. ప్రధానంగా ప్రత్యేకమైన డిజైన్, లగ్జరీ లుక్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ధర, భారతదేశంలో లభ్యతపై టెక్నో అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది.