Site icon NTV Telugu

Google 67 Search Trick: Google లో 67 అని సెర్చ్ చేశారా? అయితే షేక్ కావాల్సిందే..

Google 67 Search Trick

Google 67 Search Trick

Google 67 Search Trick: ఈ రోజుల్లో Google అనేది మనందరి జీవితాల్లో అంతర్భాగంగా మారింది. చిన్నదైనా పెద్దదైనా ప్రతిదానికీ మనం Google Search పై ఆధారపడతాం. కానీ Google లో యూజర్స్‌ను ఆశ్చర్యపరిచే కొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు, ట్రిక్స్ ఉన్నాయని మీలో ఎంత మందికి తెలుసు. ప్రస్తుతం Google లో 67 నంబర్ గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. కానీ ఈ నంబర్ ఏంటి, మీరు దానిని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఏమి జరుగుతుంది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Vaibhav Sooryavanshi History: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్, కోహ్లీకి కూడా సాధ్యంకాలే!

నిజానికి Google సెర్చ్ 67 నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే మీరు ఆశ్చర్యపోయే విషయాన్ని గమనిస్తారు. నిజానికి ఇది సరదాగా కూడా ఉంటుంది. వాస్తవానికి మీరు గూగుల్‌లో ఈ నంబర్ టైప్ చేసిన సెర్చ్ చేస్తే, ఒక్క క్షణం షాక్ అవుతారు. కానీ తర్వాత క్షణం ఈ ట్రిక్ అద్భుతంగా ఉందని మీరు గుర్తిస్తారు. ముందుగా మీరు గూగుల్ సెర్చ్ బార్‌లో 67 లేదా 6-7 అని టైప్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే, మీ కంప్యూటర్ స్క్రీన్ ఉన్నట్లుండి కొన్ని సెకన్ల పాటు షేక్ కావడాన్ని గమనిస్తారు. ఉన్నట్లుండి ఈ షేకింగ్ ముందు మిమ్మల్ని అయోమయానికి గురి చేసిస్తుందని, అలాగే ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ మ్యాజిక్ కంప్యూటర్లు/ల్యాప్‌టాప్‌లలో మాత్రమే కాకుండా ఫోన్‌లలో కూడా పనిచేస్తుంది. దీనికి మీరు భయపడాల్సిన పని లేదు.. ఇది బగ్ లేదా హార్డ్‌వేర్ సమస్య కాదు, నిజానికి ఇదొక సరదా ఫీచర్. ఇది పూర్తిగా వినోదం కోసం మాత్రమే.

ఈ విధంగా ట్రై చేయండి..
మీ ఫోన్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో Googleని తెరవండి.
సెర్చ్ బార్‌లో 67 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
స్క్రీన్ కొన్ని సెకన్ల పాటు షేక్ కావడం కనిపిస్తుంది.

ఇది సురక్షితమేనా ?
ఈ ఫీచర్ సురక్షితమేనా అని చాలా మంది ఆలోచిస్తుండవచ్చు. అవును, ఈ ఫీచర్ పూర్తిగా వినోదం కోసమే. కొన్ని సెకన్ల పాటు షేక్ చేసిన తర్వాత, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ మళ్లీ ఆటోమెటిక్‌గా నార్మల్ స్టేజ్‌కు వస్తుంది. పొరపాటున ఏదైనా కారణంతో ఆ షేకింగ్ ఆగకపోతే, ఆ పేజీని రిఫ్రెష్ చేయండి లేదా బ్యాక్ బటన్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది.

READ ALSO: The Raja Saab : ప్రభాస్ వింటేజ్ స్టైల్ చూశారా? ‘ది రాజా సాబ్’ నుంచి క్రేజీ సాంగ్ ప్రోమో వచ్చేసింది!

Exit mobile version