NTV Telugu Site icon

Turning a Smartphone into a TV remote: ఈ టిప్స్ ఉపయోగించి స్మార్ట్ ఫోన్‌ని మీ టీవీ రిమోట్ మార్చండి..

Smartphone Into Tv Remote

Smartphone Into Tv Remote

Smartphone into TV remote: సాధారణంగా మనం ప్రతీ ఇంట్లో ప్రతీసారి టీవీ రిమోట్ కోసం తీవ్రంగా వెతికే ఉంటాము. ఒక్కోసారి రిమోట్ మనకు పెద్ద పరీక్షనే పెడుతుంది. కొన్ని నిమిషాల వరకు రిమోట్ దొరకని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇలాంటి కష్టాలను తొలగించుకునేందుకు మీ స్మార్ట్ ఫోన్ నే మీ టీవీ రిమోట్ గా మార్చుకొండి. ఇప్పుడున్న కాలంలో సెల్ ఫోన్ మన శరీరంలో ఓ భాగంగా మారింది. దీంతో రిమోట్ కనిపించకుండా పోయినా కూడా పర్వాలేదు. ఎంచక్కా స్మార్ట్ ఫోన్ తో టీవీని ఆపరేట్ చేయొచ్చు.

Google TV యాప్‌తో, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ Android ఓఎస్ పై నడిచే టీవీలను ఆపరేట్ చేయవచ్చు. ఒక వేళ రిమోట్ కనిపించకున్నా కూడా మీ టీవీని ఫోన్ తో సులభంగా నియంత్రించవచ్చు. మీకు నచ్చిన ఛానెల్ మార్చుకోవడంతో పాటు సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, టీవీలో యాప్స్ ఓపెన్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ గూగల్ టీవీ యాప్ పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్‌గా ఇలా మార్చండి..

* Google Play స్టోర్‌ని తెరిచి, Google TV యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* మీ టీవీ, ఫోన్ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ టీవీకి Wi-Fi లేకపోతే, మీరు మీ ఫోన్ మరియు టీవీని కనెక్ట్ చేయడానికి బ్లూటూత్‌ని కూడా ఉపయోగించవచ్చు.
* Google TV యాప్‌ను ఒపెన్ చేసి, దిగువ కుడి మూలలో ఉన్న రిమోట్ బటన్‌ను ప్రెస్ చేయండి.
* వెంటనే యాప్ డివైజెస్ ని స్కాన్ చేస్తుంది. ఆ తరువాత మీ టీవీని గుర్తిస్తుంది. ఫోన్ లో టీవీని ఎంచుకోండి
* మీ టీవీ స్క్రీన్‌పై కోడ్ కనిపిస్తుంది. యాప్‌లో కోడ్‌ని నమోదు చేసి ఫోన్ ని టీవీని పెయిర్ చేయండి.
* పెయిరింగ్ పూర్తయిన తర్వాత మీ ఫోన్ ని రిమోట్ లా వాడి టీవీని ఆపరేట్ చేయవచ్చు.

ఐఫోన్ యూజర్లు ఇలా చేయండి:

* ఐఫోన్, టీవీ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయబడి ఉన్నాయో ముందుగా నిర్ధారించుకోండి.
* యాప్ స్టోర్ నుంచి Google TV యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
* మీ ఐఫోన్ లో Google TV యాప్‌ను ఓపెన్ చేయాలి.
* స్క్రీన్ కుడి దిగువ మూలన ఉన్న టీవీ రిమోట్ సింబల్ పై ప్రెస్ చేయండి.
* యాప్ మీ టీవీ కోసం స్కాన్ చేస్తుంది. మీ టీవీని ఒక వేళ స్కాన్ చేయలేకపోతే.. డివైజెస్ కోసం స్కాన్ బటన్ పై ప్రెస్ చేయండి.
* మీ టీవీని గుర్తించిన తర్వాత దాన్ని ఎంచుకుని, మీ టీవీ స్క్రీన్‌పై కనిపించే 6-అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి.
* మీ ఐఫోన్ ని టీవీతో కనెక్ట్ చేయడానికి పెయిర్ ఆప్షన్ పై ప్రెస్ చేయండి.
* మీ ఐఫోన్‌ని మీ టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత, మీరు సాధారణ రిమోట్ కంట్రోల్‌తో మీ టీవీని నియంత్రించినట్లుగానే దాన్ని ఉపయోగించవచ్చు.