TCL P80 Series: ప్రముఖ టెక్నాలజీ సంస్థ TCL P80 సిరీస్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. TCL P80, TCL P80 Pro పేర్లతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో TCL P80 Ultra అందుబాటులో ఉంది. కొత్తగా వచ్చిన రెండు మోడళ్లలో 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8GB RAM వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిలో TCL P80 MediaTek Dimensity 7300 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుండగా.. P80 Pro మరింత శక్తివంతమైన Dimensity 7400 Elite ప్రాసెసర్‌తో వస్తుంది. ముఖ్యంగా P80 Proలో TCL ప్రత్యేకమైన NXTPAPER డిస్‌ప్లే టెక్నాలజీ అందించింది.
TCL P80 ధర, లభ్యత
TCL P80 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర €349, అంటే సుమారు రూ.38,500గా ఉంది. ఇక 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర €379, అంటే సుమారు రూ.41,500. ఈ ఫోన్ Midnight Blue, Sunlight Gold రంగుల్లో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Amazon ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
TCL P80 Pro ధర
TCL P80 Pro బేస్ వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని ధర €429, అంటే సుమారు రూ.47,000. మరోవైపు 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర €499, అంటే సుమారు రూ.55,000గా ఉంది. P80 Pro కూడా Midnight Blue, Sunlight Gold కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
TCL P80 డిస్‌ప్లే
TCL P80లో 6.83-అంగుళాల డిస్‌ప్లే అందించారు. ఇది 2772 × 1280 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. అలాగే 2560Hz టచ్ రెస్పాన్స్ రేట్ ఉంది. అయితే P80 Proతో పోలిస్తే P80లో TCL ప్రత్యేకమైన NXTPAPER టెక్నాలజీని అందించలేదు.
Dimensity 7300 Elite చిప్‌సెట్
పనితీరు కోసం TCL P80లో MediaTek Dimensity 7300 Elite చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 8GB RAM జత చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB, 256GB ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి అవసరాలకు ఈ కాన్ఫిగరేషన్ ఉపయోగపడుతుంది.
50MP OIS కెమెరా
ఫోటోగ్రఫీ కోసం TCL P80లో 50MP ప్రధాన కెమెరా ఉంది. దీనికి OIS (Optical Image Stabilization), EIS (Electronic Image Stabilization) సపోర్ట్ ఇచ్చారు. ప్రధాన కెమెరాకు అదనంగా అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లను కూడా అందించారు.
5000mAh బ్యాటరీ
TCL P80లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆడియో కోసం DTS సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు అందించారు. ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కూడా ఉంది.
TCL P80 Pro స్పెసిఫికేషన్లు
TCL P80 Proలో కూడా 6.83-అంగుళాల డిస్‌ప్లే అందించారు. అయితే ఈ మోడల్‌లో ప్రత్యేక ఆకర్షణ TCL NXTPAPER టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ స్క్రీన్‌ను ఈ-రీడర్ తరహాలో ఉపయోగించుకోవచ్చు. ఎక్కువసేపు చదివే వారికి స్క్రీన్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చడమే దీని ఉద్దేశం. అలాగే ఇందులో యాంటీ-గ్లేర్ టెక్నాలజీ ఉంది. దీంతో బయట ఎండలో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది. బ్లూ లైట్‌ను కూడా గణనీయంగా తగ్గించేలా ఈ డిస్‌ప్లేను రూపొందించారు.
P80 Pro డిస్‌ప్లే గరిష్టంగా 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
TCL P80 Proలో MediaTek Dimensity 7400 Elite చిప్‌సెట్‌ను అందించారు. దీనికి 8GB RAM జత చేశారు. స్టోరేజ్ పరంగా 256GB, 512GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కెమెరా విభాగంలో TCL P80 Proలో 50MP ప్రధాన కెమెరా అందించారు. దీనికి అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. అయితే P80తో పోలిస్తే P80 Proలో ప్రత్యేకంగా టెలిఫోటో కెమెరా అందించలేదు.
7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్
సాఫ్ట్‌వేర్ సపోర్ట్ విషయంలో TCL P80 Proకు కంపెనీ కీలకమైన హామీ ఇచ్చింది. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, ఏకంగా 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని TCL తెలిపింది. దీంతో ఎక్కువ కాలం ఫోన్‌ను ఉపయోగించాలనుకునే వినియోగదారులకు P80 Pro ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉంది.

