ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!

  • TCL 65 అంగుళాల 4K QD-Mini LED గూగుల్ టీవీపై భారీ ఆఫర్
  • అసలు ధర ₹1,32,990.. ఆఫర్ ధర ₹71,990
  • దాదాపు ₹61,000 వరకు ప్రత్యక్ష తగ్గింపు
  • అదనంగా ₹2,000 కూపన్ డిస్కౌంట్
  • ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ₹3,000 వరకు బ్యాంక్ ఆఫర్..
Tcl 4k Google Tv

Tcl 4k Google Tv

TCL 4K Google TV: ఇంట్లోనే అద్భుతమైన సినిమా హాల్ అనుభూతిని కోరుకునే టెక్ ప్రియుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ TCL స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ కు అందిస్తుంది. అదే TCL 164 cm (65 Inches) 4K UHD స్మార్ట్ మినీ LED గూగుల్ టీవీ (మోడల్: 65T8DS). సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, థియేటర్ స్థాయి ఆడియో అవుట్‌పుట్, స్మార్ట్ ఫీచర్లతో రూపొందిన ఈ ప్రీమియం టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక స్పెసిఫికేషన్లతో భారీ డిస్కౌంట్ తో ఆకర్షణీయమైన ధరకు అందుబాటులోకి వచ్చింది. మరి ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

అధునాతన డిస్‌ప్లే & ప్రీమియం మెటాలిక్ డిజైన్..

ఈ స్మార్ట్ టీవీలో 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన 65-అంగుళాల 4K UHD QD-Mini LED ప్యానెల్‌ను అమర్చారు. విజువల్స్ సహజసిద్ధమైన రంగులతో స్పష్టంగా కనిపించేలా ఇందులో అధునాతన AiPQ Pro ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది డాల్బీ విజన్, HDR 10+, HDR 10 మరియు HLG వంటి హై-ఎండ్ ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుంది. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్, ప్రీమియం మెటాలిక్ బెజెల్-లెస్ బాడీ, ఎక్కువ సమయం టీవీ చూసినా కళ్లకు అలసట కలగకుండా ఉండేందుకు ‘మల్టిపుల్ ఐ కేర్’ ఫీచర్‌ను ఇందులో చేర్చారు.

Onkyo 2.1 ఛానల్ ఆడియో అనుభవం

సినిమాటిక్ విజువల్స్‌కు సరిపడే రీతిలో అద్భుతమైన సౌండ్ అనుభూతిని అందించడానికి ప్రముఖ ఆడియో సంస్థ Onkyo రూపొందించిన 2.1 ఛానల్ స్పీకర్ సెటప్‌ను ఈ టీవీలో అందించారు. ఇది ఏకంగా 35W సౌండ్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా.. డాల్బీ అట్మాస్ (Dolby Atmos), డీటీఎస్ వర్చువల్:ఎక్స్ (DTS Virtual:X) సాంకేతికతలు గది నలువైపులా థియేటర్ తరహా సరౌండ్ సౌండ్‌ను విస్తరింపజేస్తాయి. బాస్, వోకల్స్ స్పష్టంగా వినిపించడం వల్ల సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్‌లు వీక్షించేటప్పుడు అద్భుతమైన శబ్ద నాణ్యత లభిస్తుంది.

స్మార్ట్ పనితీరు

ఈ మోడల్ యూజర్ ఫ్రెండ్లీ గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. రోజువారీ యాప్స్ సజావుగా రన్ అయ్యేందుకు 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా లభిస్తాయి. వాయిస్ ఆదేశాల కోసం గూగుల్ అసిస్టెంట్, అలెక్సా సపోర్ట్ ఉండటంతో పాటు ఫోన్ స్క్రీన్‌ను పెద్ద తెరపై చూసేందుకు స్క్రీన్ మిర్రరింగ్ అందుబాటులో ఉంది. గేమర్స్ కోసం ప్రత్యేకంగా ‘గేమ్‌బార్’ ఫీచర్‌ను జోడించారు. కనెక్టివిటీ పరంగా 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, 1 LAN పోర్ట్, డిజిటల్ ఆడియో అవుట్, AV అడాప్టర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 5 ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీకి 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది.

వారంటీ & ఇన్‌స్టాలేషన్

టీవీ ప్యాకేజీలో 65-అంగుళాల టీవీతో పాటు టేబుల్ టాప్ స్టాండ్, స్మార్ట్ రిమోట్ కంట్రోల్ మరియు రెండు బ్యాటరీలు లభిస్తాయి. కొనుగోలు చేసిన నాటి నుంచి టీవీపై రెండేళ్ల తయారీదారు బ్రాండ్ వారంటీ, రిమోట్‌పై 6 నెలల వారంటీ వర్తిస్తుంది. ఇ-కామర్స్ ఆర్డర్ ఇన్‌వాయిస్ ద్వారానే ఈ వారంటీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే అధీకృత నిపుణుల ద్వారా ఉచిత బ్రాండ్ ఇన్‌స్టాలేషన్, డెమో సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

ధర, భారీ డిస్కౌంట్

ప్రస్తుతం ఈ 65-అంగుళాల ఫ్లాగ్‌షిప్ టీవీపై కనీవినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ఎంఆర్‌పీ ధర ₹1,32,990 కాగా.. ఏకంగా 46 శాతం భారీ తగ్గింపుతో కేవలం ₹71,990కే అందుబాటులో ఉంది. అంటే దాదాపు ₹61,000 వరకు ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా.. కొనుగోలు సమయంలో వర్తించే అదనపు ₹2,000 కూపన్ డిస్కౌంట్ను అప్లై చేసుకుంటే ధర మరింత తగ్గుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ₹3,000 వరకు ఇన్స్టంట్ బ్యాంక్ తగ్గింపు మరియు ₹2,159 వరకు అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. బడ్జెట్ కొనుగోలుదారుల కోసం HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై నెలకు కేవలం ₹11,998 (6 నెలలు) నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉండటంతో సుమారు ₹4,000 పైగా వడ్డీ ఆదా అవుతుంది.