Site icon NTV Telugu

రూ.1.09 లక్షల టీవీ ఇప్పుడు కేవలం రూ.36,990.. 55 అంగుళాల TCL 4K Ultra HD Smart QLED Google TVపై భారీ ఆఫర్..!

Tcl

Tcl

TCL 4K Ultra HD Smart QLED Google TV: టీసీఎల్ సంస్థ సంబంధించిన 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ QLED గూగుల్ టీవీ (TCL 4K Ultra HD Smart QLED Google TV) 55T8C మోడల్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ టీవీ అసలు ధర రూ.1,09,990 కాగా ఇప్పుడు అమెజాన్‌లో 66 శాతం తగ్గింపుతో కేవలం రూ.36,990కే లభిస్తోంది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.6,165 చొప్పున 6 నెలల పాటు నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా వినియోగదారులకు అందిస్తోంది. ఈ భారీ ధర తగ్గింపుతో కూడిన స్మార్ట్ టీవీ ప్రీమియం ఫీచర్లు, మెరుగైన పిక్చర్ క్వాలిటీ, అధునాతన గేమింగ్ మోడ్‌లను కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది.

Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

55 అంగుళాల 4K QLED ప్యానెల్ (3840 x 2160)తో వచ్చిన ఈ మోడల్ 4K HDR Pro, HDR10, AiPQ ప్రాసెసర్, డాల్బీ విజన్ సపోర్ట్‌ను అందిస్తోంది. 144 Hz మోషన్ క్లారిటీ ప్రో, 120 Hz MEMC, VRR 144 Hz, DLG 240 Hz వంటి రిఫ్రెష్ రేట్ టెక్నాలజీలు స్పోర్ట్స్, యాక్షన్ మూవీస్, గేమింగ్‌కు మరింత సాఫ్ట్ విజువల్స్‌ను ఇస్తాయి. టీవీలో 35 వాట్స్ డాల్బీ ఆటమ్స్ ఆడియో అవుట్‌పుట్‌తో సినిమాటిక్ సౌండ్ అనుభవాన్ని ఇస్తుంది. హోం థియేటర్ స్థాయి సౌండ్‌ను కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయస్. ఈ టీవీ గూగుల్ TV ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది.

Droupadi Murmu : ఈనెల 17న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇందులో 3 GB ర్యామ్, 32 GB రామ్, 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్, గూగుల్ అసిస్టెంట్, స్క్రీన్ మిర్రరింగ్, వెబ్ బ్రౌజర్ ఉన్నాయి. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, హాట్ స్టార్, జీ5 వంటి ప్రముఖ యాప్స్‌ ప్రీ-ఇన్‌స్టాల్ గా ఉంటాయి. అలాగే దీనిలోని 288 Hz గేమ్ యాక్సిలరేటర్, Game Master ఫీచర్లు గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి. టీవీ అనేక కనెక్టివిటీ పోర్టులను అందిస్తోంది. ఇందులో 4 HDMI పోర్టులు, 1 USB పోర్టు, LAN, యాంటెన్నా ఇన్‌పుట్, డిజిటల్ ఆడియో అవుట్ సపోర్ట్ ఉన్నాయి. టీవీపై 2 సంవత్సరాలు, రిమోట్‌పై 6 నెలల వారంటీ లభిస్తుంది. అమెజాన్ E-ఇన్వాయిస్‌తో వారంటీ క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Exit mobile version