NTV Telugu Site icon

Sunita Williams: క్షీణించిన సునీతా విలియమ్స్ ఆరోగ్యం? శాస్త్రవేత్తల్లో ఆందోళన

Sunita Williams

Sunita Williams

భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, సహచరుడు విల్మోర్ బుచ్ అంతరిక్షంలో చిక్కుకుని చాలా నెలలు అయ్యింది. ఇద్దరు వ్యోమగాములు జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా, ఇద్దరూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇంతలో తాజాగా సునీతా విలియమ్స్ కి చెందిన కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇది శాస్త్రవేత్తలతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. చిత్రాలను చూస్తుంటే సునీత బాగా బరువు తగ్గిందని, బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనిపిస్తుంది. అయితే అంతరిక్ష యాత్రికులకు ఇది సాధారణ సమస్య అని నిపుణులు వాధిస్తున్నారు.

READ MORE: Maharashtra Polls: అసెంబ్లీకి పంపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేస్తా.. ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి హామీ

సునీతా విలియమ్స్ రోజూ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సునీతా విలియమ్స్ చిత్రాలపై నాసా స్పందన కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవలి నాసా స్పేస్ ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్ ప్రతినిధి జిమ్మీ రస్సెల్.. “అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగాములు అందరూ సాధారణ పరీక్షలు చేయించుకుంటారు. ప్రత్యేక సర్జన్లు వారిని పర్యవేక్షిస్తారు. వ్యోమగాములు అందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారు” అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. నవంబర్ 5 న, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులకు పైగా గడిపిన నలుగురు క్రూ -8 వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత చెకప్ కోసం పంపారు. పరీక్షల అనంతరం వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ కారణంగా, సునీతా విలియమ్స్, విల్మోర్ బుచ్ గురించి ఆందోళనలు పెరిగాయి.

READ MORE: Sridhar Babu: కేంద్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేయవద్దు.. రైతులను ఆదుకోండి

Show comments