Site icon NTV Telugu

10,000 కంటే ఎక్కువ యాప్స్, అల్ట్రా HD డిస్‌ప్లే ఉన్న Sony BRAVIA 3 Series Google టీవీపై రూ.49,900 భారీ డిస్కౌంట్!

Sony

Sony

Sony BRAVIA 3 Series Google Tv: కొత్త టీవీ కొనాలని చూసేవారు ప్రస్తుతం ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని పొందాలని ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు. అందుకోసం నాణ్యమైన డిస్‌ప్లే, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న టీవీని ఎంచుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇందుకోసం టీవీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ‘సోనీ’ (Sony) సంబంధించిన BRAVIA 3 సిరీస్ (K-55S30B) మోడల్‌ క్రేజీ ఆఫర్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరీ ఆ వివరాలేంటో చూసేద్దామా..

4K అల్ట్రా HD డిస్‌ప్లే:
ఈ టీవీ 55 ఇంచుల భారీ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో ఉన్న 4K HDR ప్రొసెసర్ X1 సాంకేతికత వల్ల ప్రతి దృశ్యం అత్యంత స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తుంది. ఇది సాధారణ కంటెంట్‌ను కూడా 4K నాణ్యతకు దగ్గరగా అప్‌స్కేల్ చేస్తుంది.

గూగుల్ టీవీ (Google TV):
ఇది గూగుల్ టీవీ ఓఎస్‌పై పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి 10,000 కంటే ఎక్కువ యాప్‌లు, లక్షలాది సినిమాలు, షోలను ఒకే చోట పొందవచ్చు. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో టీవీని కంట్రోల్ చేయవచ్చు.

గేమింగ్ & ఆడియో:
గేమ్స్ ఆడేవారి కోసం ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా PS5 కోసం ‘ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్’ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక సౌండ్ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న X-బ్యాలెన్స్‌డ్ స్పీకర్లు ‎20 వాట్స్ సౌండ్ తో సినిమాటిక్ ఆడియో అనుభూతిని అందిస్తాయి.

స్మార్ట్ కనెక్టివిటీ:
ఆపిల్ ఎయిర్‌ప్లే (Apple AirPlay), క్రోమ్‌కాస్ట్ (Chromecast) బిల్ట్-ఇన్ సదుపాయం ఉండటం వల్ల మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్‌ను సులభంగా టీవీలోకి షేర్ చేయవచ్చు.

భారీ ధర తగ్గింపు:
ఈ సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీ ధరపై ప్రస్తుతం అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీని అసలు ధర (M.R.P.) రూ. 1,18,900 కాగా.. ప్రస్తుత ఆఫర్ గా దీనిని కేవలం రూ. 68,990 కు లభిస్తుంది. అంటే ఈ టీవీపై సుమారు 42% తగ్గింపు లభిస్తుంది.

ఒకవేళ మీకు HDFC బ్యాంక్ లేదా ఇతర ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డులను కలిగిఉంటే అదనంగా రూ. 6,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. దీనివల్ల ఈ టీవీ మీకు మరింత తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే నెలకు రూ.2,425 నుండి ప్రారంభమయ్యే ‘నో కాస్ట్ EMI’ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version