Smart Fitness Mirror: ఫిట్‌నెస్ ప్రేమికులకు శుభవార్త. పోర్టల్ (PORTL) అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో పనిచేసే మోడ్రన్, స్మార్ట్ ఫిట్‌నెస్ మిర్రర్‌ని రూపొందించింది. ఇది మన ఎక్సర్‌సైజ్ వర్కౌట్‌లకు రియల్ టైమ్ ఫామ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. హెల్త్ ట్రాకింగ్, మోనిటరింగ్ కూడా చేస్తుంది. ఇందులో పాకెట్ సైజ్‌లో ఉండే బయో సెన్స్ డివైజ్ మన బాడీ ఈసీజీ, బ్లడ్ షుగర్, టెంపరేచర్, బ్లడ్ ప్రెజర్ తదితర కీలక సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో అందిస్తుంది. మన ఫిట్‌నెస్ జర్నీలో పర్ఫెక్ట్ గైడ్‌లా సలహాలు సూచనలు ఇస్తుంది. ఈ ఇంటలిజెంట్ హోం మిర్రర్‌ని ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా సెట్ చేసుకోవచ్చు.
43 అంగుళాల పరిమాణంలో ఉండే ఈ మల్టీ టచ్ స్క్రీన్.. అడ్వాన్స్‌డ్ సెన్సార్లను, హెల్త్‌కేర్, ఫిట్‌నెస్, వెల్‌నెస్ యాప్‌లను కలిగి ఉంటుంది. దీనికి హెవీ డ్యూటీ కంప్యూటర్ పవర్ ఉంటుంది. ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించే ముందు ఇందులోని వివిధ రేంజ్‌లను పరిశీలించి మనకు కావాల్సినదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హెచ్‌ఐఐటీ, స్ట్రెంత్, ఎండ్యూరన్స్, కార్డియా, డ్యాన్స్, యోగా, మెడిటేషన్, పెయిన్ మేనేజ్మెంట్ వంటి రేంజ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ అద్దానికి ఉన్న ఇతర స్పెసిఫికేషన్లు: హెచ్‌డీ కెమెరా, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ స్మార్ట్‌వాచ్. మరిన్ని వివరాల కోసం, డెమో కోసం ‘ఎన్-బిజినెస్ టెక్‌టాక్’ అందిస్తున్న ఈ వీడియో చూస్తే సరిపోతుంది.