Samsung Galaxy Unpacked 2026: సామ్ సంగ్ ఫోల్డబుల్ 5G ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ డేట్ ఫిక్స్..!

  • Samsung Galaxy Unpacked 2026 ఈవెంట్‌
  • జూలై 22న లండన్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది
  • ఫోల్డబుల్ 5G ఫోన్లు, గెలాక్సీ వాచ్ 9, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్
Samsung Galaxy Unpacked 202

Samsung Galaxy Unpacked 202

Samsung Galaxy Unpacked 2026: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Samsung Galaxy Unpacked 2026 ఈవెంట్‌కు ఎట్టకేలకు తేదీ ఖరారైంది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung తన వార్షిక గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను జూలై 22న లండన్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులు ఈ ఈవెంట్‌ను సాయంత్రం 6:30 గంటల (IST) నుంచి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. ఈసారి Samsung కేవలం కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా, Galaxy Watch 9, Galaxy Watch Ultra 2, అలాగే ఎంతోకాలంగా ప్రచారంలో ఉన్న స్మార్ట్ గ్లాసెస్ ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని లీకులు, నివేదికలు సూచిస్తున్నాయి.

మూడు కొత్త ఫోల్డబుల్ 5G ఫోన్లు వచ్చే అవకాశం

ఈ ఏడాది Samsung రెండు కాకుండా మూడు కొత్త ఫోల్డబుల్ 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అందులో Samsung Galaxy Z Fold 8, Samsung Galaxy Z Fold 8 Ultra, Samsung Galaxy Z Flip 8 మోడళ్లు ఉండే అవకాశముంది. ఇటీవల విడుదలైన అధికారిక టీజర్‌ల ప్రకారం, కొత్త Fold సిరీస్ గత మోడళ్లతో పోలిస్తే మరింత వెడల్పుగా, సన్నని డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల పెద్ద డిస్‌ప్లే, మెరుగైన మల్టీటాస్కింగ్ అనుభవం లభించవచ్చని భావిస్తున్నారు.

కొత్త Galaxy AI ఫీచర్లపై దృష్టి

Samsung ఈసారి Galaxy AIను మరింత స్మార్ట్‌గా, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించేలా రూపొందిస్తున్నట్లు టీజర్‌లో పేర్కొంది. పెద్ద ఫోల్డబుల్ డిస్‌ప్లేలను దృష్టిలో పెట్టుకుని కొత్త AI ఫీచర్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో మల్టీటాస్కింగ్, ప్రొడక్టివిటీ, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Galaxy Watch 9, Watch Ultra 2 కూడా

ఫోల్డబుల్ ఫోన్లతో పాటు Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. లీకుల ప్రకారం Galaxy Watch Ultra 2లో గరిష్టంగా 5,000 నిట్స్ బ్రైట్‌నెస్
800mAh బ్యాటరీ, IP69K రేటింగ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశముంది. ఇవి అవుట్‌డోర్ యాక్టివిటీలకు మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు సమాచారం.

స్మార్ట్ గ్లాసెస్‌పై తొలి చూపు

Galaxy Unpacked 2026 ఈవెంట్‌లో Samsung తన తొలి స్మార్ట్ గ్లాసెస్ ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. Android XR ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న ఈ వేరబుల్ డివైస్ అభివృద్ధిలో Warby Parker, Gentle Monster వంటి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లతో Samsung భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

ఎక్కడ చూడాలి?

Samsung Galaxy Unpacked 2026 ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారతీయ వినియోగదారులు జూలై 22 సాయంత్రం 6:30 గంటల నుంచి Samsung అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ఈవెంట్‌ను వీక్షించవచ్చు.