Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?

Samsung Galaxy Z Fold 8 Ultra Vs Galaxy Z Fold 7

Samsung Galaxy Z Fold 8 Ultra Vs Galaxy Z Fold 7

Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: శాంసంగ్ నుండి తాజాగా విడుదలైన ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Galaxy Z Fold 8 Ultraను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న Galaxy Z Fold 7తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లో డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ, పనితీరు, ఛార్జింగ్ వంటి విభాగాల్లో పలు కీలక అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. అయితే ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. మరి ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్? వాటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏంటో తెలుసుకుందాం.

డిస్‌ప్లే:

రెండు ఫోన్లలోనూ 8 అంగుళాల Dynamic AMOLED 2X ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉంది. అయితే Galaxy Z Fold 8 Ultraలో 2504 × 2256 రిజల్యూషన్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. Z Fold 7లో మాత్రం 2184 × 1968 రిజల్యూషన్, 2,600 నిట్స్ బ్రైట్‌నెస్ మాత్రమే ఉంది. కొత్త Flex Titanium నిర్మాణంతో Fold 8 Ultraలో స్క్రీన్ క్రీజ్ కూడా తక్కువగా కనిపిస్తుందని శాంసంగ్ చెబుతోంది. దీంతో వీడియోలు చూడటం, మల్టీటాస్కింగ్ చేయడం మరింత మెరుగైన అనుభూతిని ఇస్తుంది.

కొత్త చిప్‌:

Galaxy Z Fold 8 Ultraలో Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్‌ను ఉపయోగించగా, Fold 7లో Snapdragon 8 Elite for Galaxy చిప్ ఉంది. కొత్త చిప్ వల్ల మంచి పనితీరు, తక్కువ పవర్ వినియోగం, ఎక్కువసేపు గేమింగ్ చేసినా హీట్ తక్కువగా ఉండేలా పెద్ద గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను శాంసంగ్ అందించింది. రెండు ఫోన్లలోనూ గరిష్ఠంగా 16GB RAM, 1TB స్టోరేజ్ ఆప్షన్ లభిస్తుంది.

కెమెరా:

రెండు ఫోన్లలోనూ 200MP మెయిన్ కెమెరా ఉంది. అయితే Galaxy Z Fold 8 Ultraలో మెరుగైన HDR, డైనమిక్ రేంజ్, కలర్ ప్రాసెసింగ్ అందించారు. అయితే పెద్ద మార్పు అల్ట్రా వైడ్ కెమెరాలో కనిపిస్తుంది. Fold 7లో 12MP అల్ట్రా వైడ్ ఉండగా.. Fold 8 Ultraలో 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఇచ్చారు. దీంతో ల్యాండ్‌స్కేప్ ఫోటోలు, డీటెయిల్స్ మరింత మెరుగ్గా రికార్డ్ అవుతాయి. రెండు ఫోన్లలోనూ 10MP టెలిఫోటో కెమెరాతో 3x ఆప్టికల్ జూమ్, 30x స్పేస్ జూమ్ ఫీచర్ అందుబాటులో ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్‌:

Galaxy Z Fold 8 Ultraలో 5,000mAh బ్యాటరీ ఉండగా, Fold 7లో 4,400mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ పరంగా కూడా Ultra స్పష్టమైన ఆధిక్యం చూపుతోంది. ఇందులో 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండగా, Fold 7లో 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ మాత్రమే లభిస్తుంది.

డిజైన్‌లో మార్పులు:

రెండు ఫోన్ల బరువు 215 గ్రాములు. అలాగే Armor Aluminum ఫ్రేమ్, Gorilla Glass Victus 2 రక్షణ, IP48 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రెండింటిలోనూ ఉన్నాయి. Ultra మోడల్ అన్‌ఫోల్డ్ చేసినప్పుడు కొద్దిగా సన్నగా ఉన్నప్పటికీ, డిజైన్‌లో పెద్ద మార్పులు కనిపించవు.

సాఫ్ట్‌వేర్, AI ఫీచర్లు:

Galaxy Z Fold 8 Ultra ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో వస్తుండగా, Fold 7 ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8తో విడుదలైంది. రెండు ఫోన్లకూ 7 సంవత్సరాల Android OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి. Galaxy AI, Google Gemini, Circle to Search, Live Translation, AI Photo Editing వంటి ఫీచర్లు రెండింటిలోనూ ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వచ్చే కొత్త AI ఫీచర్లు ముందుగా Ultra మోడల్‌కు వచ్చే అవకాశం ఉంది.

ధర:

Samsung Galaxy Z Fold 7 ప్రారంభ ధర రూ.1,74,999 కాగా.. Samsung Galaxy Z Fold 8 Ultra ప్రారంభ ధర రూ.1,99,999గా ఉన్నాయి. ప్రస్తుతం శాంసంగ్ ఆఫర్‌లో Galaxy Z Fold 8 Ultraను ఎఫెక్టివ్ ధర రూ.1,89,999కు అందిస్తోంది. దీంతో రెండు ఫోన్ల మధ్య ధర తేడా సుమారు రూ.15,000కు తగ్గింది.

ఏ ఫోన్ కొనాలి?

ఇప్పటికే Galaxy Z Fold 7 ఉపయోగిస్తున్న వారికి వెంటనే అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం పెద్దగా కనిపించదు. ఎందుకంటే కొత్త మార్పులు మెరుగుదలలే తప్ప చెప్పుకోతగ్గవేమీ కావు. అయితే పాత Fold ఫోన్ నుంచి అప్‌గ్రేడ్ అవుతున్న వారు లేదా తొలిసారి శాంసంగ్ ఫోల్డబుల్ కొనాలని భావిస్తున్న వారికి Galaxy Z Fold 8 Ultra మంచి ఎంపికగా అవుతుంది. బ్రైట్ డిస్‌ప్లే, తక్కువ క్రీజ్, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన కూలింగ్ సిస్టమ్, 50MP అల్ట్రా వైడ్ కెమెరా వంటి అప్‌గ్రేడ్‌లు అదనంగా చెల్లించే ధరకు తగిన విలువను అందిస్తాయి.