స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్ సంగ్ తాజా ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Fold 8ను గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ప్రీవియస్ జెనరేషన్ మోడల్‌తో పోలిస్తే మరింత సన్నని డిజైన్, శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 50MP కెమెరా సిస్టమ్, 4800mAh బ్యాటరీ, కొత్త AI ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని సామ్ సంగ్ ఈ డివైస్‌ను రూపొందించింది.
Samsung Galaxy Z Fold 8 ధర
Samsung Galaxy Z Fold 8 మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ -రూ.1,79,999, 12GB RAM + 512GB స్టోరేజ్ -రూ.1,99,999, 16GB RAM + 1TB స్టోరేజ్ -రూ.2,39,999. ఈ ఫోన్ గ్రాఫైట్, క్రీమ్, లావెండర్ రంగుల్లో లభిస్తుంది. పిస్తాషియో కలర్ వేరియంట్ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.5,000 వరకు తగ్గింపు, Google AI Pro ఆరు నెలల ట్రయల్, 5TB క్లౌడ్ స్టోరేజ్, అలాగే Samsung Care+ ప్లాన్ తీసుకున్న వారికి మొదటి మూడు నెలల కవరేజ్ ఉచితంగా అందిస్తున్నారు.
పెద్ద AMOLED డిస్‌ప్లే
Samsung Galaxy Z Fold 8లో 7.6 అంగుళాల Dynamic AMOLED 2X అంతర్గత డిస్‌ప్లే ఉంది. ఇది 1848×2448 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కు మద్దతు ఇస్తుంది. బయట భాగంలో 5.5 అంగుళాల Dynamic AMOLED 2X కవర్ డిస్‌ప్లేను అందించారు. ఇది 1972×1248 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. కవర్ స్క్రీన్‌కు Corning Gorilla Glass Ceramic 3, వెనుక భాగానికి Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ను కల్పించారు.
శక్తివంతమైన ప్రాసెసర్
Galaxy Z Fold 8లో Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను అమర్చారు. Android 17 ఆధారిత One UI 9, గరిష్టంగా 16GB RAM, 1TB వరకు స్టోరేజ్, ఈ కాంబినేషన్ మల్టీటాస్కింగ్, గేమింగ్, AI ఫీచర్లు, ప్రొఫెషనల్ పనులకు అనువుగా ఉంటుంది.
50MP కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో అధునాతన కెమెరా వ్యవస్థను అందించారు.
50MP ప్రైమరీ కెమెరా
50MP సెకండరీ కెమెరా
10MP ఇన్నర్ డిస్‌ప్లే కెమెరా
10MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
కంటెంట్ క్రియేటర్ల కోసం Dual Recording ఫీచర్‌ను కూడా అందించారు. దీని ద్వారా ఫోన్ రెండు వైపుల నుంచి ఒకేసారి వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అలాగే My FanCam ఫీచర్ సబ్జెక్ట్‌ను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసి, వీడియో ఫ్రేమింగ్‌ను సర్దుబాటు చేస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
Samsung Galaxy Z Fold 8లో 4800mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.
కనెక్టివిటీ, భద్రత
5G
Wi-Fi 7
Bluetooth v6
NFC
USB Type-C
సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
IP48 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
మరింత సన్నని, బలమైన డిజైన్
Galaxy Z Fold 8లో సామ్ సంగ్ కొత్త Flex Titanium Technologyను ఉపయోగించింది. టైటానియం ప్లేట్‌తో ప్రత్యేక టైటానియం అల్లాయ్ ఫిల్మ్‌ను కలిపి రూపొందించిన ఈ నిర్మాణం వల్ల ఫోన్ మరింత సన్నగా ఉండటంతో పాటు బలంగా కూడా ఉంటుంది. కొత్త హింజ్ డిజైన్ కారణంగా ఫోన్‌ను తెరవడం, మూయడం మరింత సాఫీగా ఉంటుంది.
ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు:
పొడవు – 123.9 మి.మీ.
వెడల్పు – 161.4 మి.మీ.
మందం – 4.5 మి.మీ.
మడిచినప్పుడు:
పొడవు – 123.9 మి.మీ.
వెడల్పు – 81.9 మి.మీ.
మందం – 9.7 మి.మీ.
బరువు: 201 గ్రాములు

