Samsung నుంచి రాబోతున్న Galaxy S26 సిరీస్ ఇప్పటికే టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, ఈ సిరీస్‌లో AI ఆధారిత EdgeFusion ఆన్-డివైస్ ఇమేజ్ జనరేటర్ అనే అత్యాధునిక ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy S26 సిరీస్‌ను ఫిబ్రవరి నాల్గవ వారంలో ప్రత్యేకంగా నిర్వహించనున్న Galaxy Unpacked ఈవెంట్లో ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అయితే, Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra మోడళ్లు మార్చి నెలలో విక్రయాలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు సామ్‌సంగ్ అధికారికంగా ఈ వివరాలను ధృవీకరించలేదు.
AI ఆధారిత EdgeFusion ఇమేజ్ జనరేటర్
ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ (@UniverseIce) వెల్లడించిన వివరాల ప్రకారం, సామ్‌సంగ్ దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ AI సంస్థ Nota AIతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతోనే EdgeFusion అనే AI ఆధారిత ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్టు సమాచారం. ఈ ఫీచర్.. Galaxy S26, Galaxy S26+, Galaxy S26 Ultra, మూడు మోడళ్లలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
ఒక సెకనులోపు ఇమేజ్ జనరేషన్
EdgeFusion ప్రత్యేకత ఏమిటంటే, ఇది క్లౌడ్‌పై ఆధారపడకుండా నేరుగా ఫోన్‌లోనే (On-device).. ఒక సెకనులోపు చిత్రాలను రూపొందించగలదు.. వినియోగదారులు టెక్స్ట్ ప్రాంప్ట్ నమోదు చేస్తే, AI తక్షణమే చిత్రాలను రూపొందిస్తుంది. దీని వల్ల క్లౌడ్ ప్రాసెసింగ్ అవసరం తగ్గుతుంది.. వేగం పెరుగుతుంది.. గోప్యత మరింత మెరుగవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఫోటోగ్రఫీ & క్రియేటివ్ అనుభవాలకు బూస్ట్ అందిస్తుందని అంచాన వేస్తున్నారు.. EdgeFusion ఫీచర్ ద్వారా ఫోటోగ్రఫీ అనుభవం.. డిజిటల్ ఆర్ట్ & క్రియేటివ్ కంటెంట్ క్రియేషన్ మెరుగవుతాయని సామ్‌సంగ్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఇది ఆన్-డివైస్ AI ప్రాసెసింగ్‌ను బలోపేతం చేయాలనే సామ్‌సంగ్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా పేర్కొనబడుతోంది.
కొత్త గోప్యతా స్క్రీన్ ఫీచర్ కూడా సిద్ధం
ఇదే సమయంలో, సామ్‌సంగ్ రాబోయే గెలాక్సీ పరికరాల కోసం కొత్త గోప్యతా స్క్రీన్ ఫీచర్‌ను కూడా ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ద్వారా షోల్డర్ సర్ఫింగ్‌ను అరికట్టడం.. స్క్రీన్ కంటెంట్ యూజర్‌కు మాత్రమే కనిపించేలా చేయడం.. సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. వినియోగదారుని పక్కన ఉన్న వ్యక్తులు స్క్రీన్‌ను చూడలేని విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. యాప్‌ల వారీగా గోప్యత నియంత్రణ.. ఈ గోప్యతా స్క్రీన్ ఫీచర్‌ను ఎప్పుడు యాక్టివేట్ చేయాలి.. ఏ యాప్‌లకు వర్తించాలి.. అనే విషయాలను వినియోగదారులే కస్టమైజ్ చేసుకోవచ్చని సామ్‌సంగ్ వెల్లడించింది. అధిక స్థాయి భద్రత అవసరమైన యాప్‌లకు మాత్రమే ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకునే వీలుంటుంది.
