ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!

  • శామ్‌సంగ్ గాలక్సీ S26 FE స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ ..
  • 6.7 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్..
  • Exynos 2500 (3nm) ప్రాసెసర్‌
  • Android 17 ఆధారిత One UI 9, 7 సంవత్సరాల OS & సెక్యూరిటీ అప్‌డేట్లు
  • 50MP + 12MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా..
  • 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్
  • IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్..
Samsung Galaxy S26 Fe

Samsung Galaxy S26 Fe

Samsung Galaxy S26 FE: స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలలో ఒకటైన శామ్‌సంగ్ (Samsung) నుండి కొత్తగా గాలక్సీ S26 సిరీస్‌లో సరికొత్త ప్రీమియం బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గాలక్సీ S26 FE (Samsung Galaxy S26 FE) పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, కెమెరా సామర్థ్యాలతో పాటు శామ్‌సంగ్ కొత్త One UI 9 సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌కు 7 తరాల OS అప్‌డేట్లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

AMOLED డిస్‌ప్లే:

ఈ సరికొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2340×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో వీడియోలు, గేమింగ్, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను మంచి విజువల్ క్వాలిటీతో వీక్షించవచ్చు.

ప్రాసెసర్ & AI ఫీచర్లు:

ఈ ఫోన్‌లో పనితీరు కోసం 3nm ప్రాసెస్‌పై తయారైన శామ్‌సంగ్ Exynos 2500 డెకా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి శామ్‌సంగ్ Xclipse 950 GPU జత చేశారు. 8GB RAMతో పాటు 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత One UI 9తో పనిచేస్తుంది. One UI 9తో పలు కొత్త AI ఫీచర్లను అందించారు. “నౌ బ్రీఫ్” ద్వారా వాతావరణం, ఆరోగ్యం, షెడ్యూల్స్ వంటి వివరాలను వ్యక్తిగతీకరించిన బ్రీఫింగ్ కార్డుల రూపంలో పొందవచ్చు. “నౌ నూడ్జ్” ఫీచర్ కొన్ని థర్డ్‌పార్టీ నోటిఫికేషన్ల ఆధారంగా సందర్భానుసారమైన సూచనలు అందిస్తుంది.

అదే విధంగా “సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్” ద్వారా ఒకే సెర్చ్‌లో ఇమేజ్‌లోని పలు అంశాలను గుర్తించి వాటి గురించి సమాచారం పొందవచ్చు. “ఫోటో అసిస్ట్” సహాయంతో నేచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఫొటోల్లో లైటింగ్‌ను మార్చడం, వస్తువులను ఎడిట్ చేయడం వంటి పనులు చేయవచ్చు. “జెమినీ ఓమ్ని” ఇంటిగ్రేషన్ ద్వారా గ్యాలరీలోని వీడియోలను ఆటోమేటిక్‌గా కలిపి వీడియోను రూపొందించే సదుపాయం కూడా ఉంది.

ట్రిపుల్ కెమెరా సెటప్:

ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైల్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. టెలిఫోటో కెమెరా ద్వారా 3X ఆప్టికల్ జూమ్‌ను పొందవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు. తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫొటోలు తీసేందుకు శామ్‌సంగ్ “నైటోగ్రఫీ” ప్రాసెసింగ్ టెక్నాలజీని అందించింది. అలాగే వీడియో రికార్డింగ్‌లో My FanCam ఫీచర్ ద్వారా ఎంచుకున్న వ్యక్తిని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తూ ఫ్రేమ్‌ను సర్దుబాటు చేయవచ్చు. Super Steady with Horizontal Lock ఫీచర్ వేగంగా కదులుతున్న సమయంలోనూ వీడియోలో హారిజన్‌ను స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

బ్యాటరీ & IP68 రేటింగ్..

Samsung Galaxy S26 FEకి IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, NFC వంటి ఫీచర్లు అందించారు. ఈ ఫోన్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఫోన్ బరువు 193 గ్రాములు కాగా, మందం 7.4 మిల్లీమీటర్లు.

ధర:

ఈ కొత్త మొబైల్ ‘బ్లూబెర్రీ, గ్రాఫైట్, పిస్తాచియో’ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర 699.99 అమెరికన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది రూ.66,840కు సమానం. సెప్టెంబర్ 4 నుంచి ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌పై అతిత్వరలో అధికారిక ప్రకటన రానుంది.