Samsung Galaxy F70e 5G: దక్షిణ కొరియా దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇటీవల భారత మార్కెట్‌లో కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ F సిరీస్‌లో భాగంగా వచ్చిన Samsung Galaxy F70e 5G ఇప్పుడు అమ్మకాలకు సిద్ధమైంది. శక్తివంతమైన బ్యాటరీ, మెరుగైన కెమెరా సామర్థ్యం, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Read Also: Twin Brothers: కవల సోదరుల ‘కవల’ మార్కులు.. JEE మెయిన్స్ లో 100 పర్సంటైల్
సేల్స్ వివరాలు:
గెలాక్సీ F70e 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
* 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర: రూ.12,999
* 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర: రూ.14,999
డిస్‌ప్లే, డిజైన్:
* 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
* 120Hz రీఫ్రెష్ రేట్
* 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
* 260 ppi పిక్సెల్ డెన్సిటీ
* స్పాట్‌లైట్ బ్లూ,
లైమ్ లైట్ గ్రీన్ కలర్
బ్యాక్ ప్యానెల్‌కు ప్రీమియం లెదర్ ఫినిష్
Read Also: భద్రతకు ప్రాధాన్యం.. 5 Star Safety Rating కాంపాక్ట్ SUVలు లిస్ట్ ఇదిగో!
ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్:
* మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
* 6GB LPDDR4x ర్యామ్
* 128GB స్టోరేజ్
* ARM Mali G57 GPU
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పై వర్క్
కెమెరా, బ్యాటరీ:
* 50MP ప్రైమరీ కెమెరా
2MP సెకండరీ కెమెరా
* సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా
* 25W ఫాస్ట్ ఛార్జింగ్
* 6000mAh బ్యాటరీ
* IP54 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్
ఇతర ఫీచర్లు:
ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. Knox Vault, Quick Share వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB-C పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 25వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2026 నిర్వహించనుంది. ఇందులో గెలాక్సీ S26 సిరీస్‌తో పాటు కొత్త బడ్స్‌ను కూడా ఆవిష్కరించే ఛాన్స్ ఉంది.
