Site icon NTV Telugu

AMOLED డిస్‌ప్లే, 12GB RAM, 50MP కెమెరా.. Samsung Galaxy A57 5G స్పెక్స్ ఇవే!

Samsung

Samsung

Samsung Galaxy A57 5G: శామ్‌సంగ్ నుంచి త్వరలో మరో కొత్త మిడ్‌రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి రాబోతున్నయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతేడాది విడుదలైన Galaxy A56కి వారసుడిగా వస్తున్న శామ్‌సంగ్ Galaxy A57 5G తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోన్ భారత్‌లో లాంచ్‌కు మరింత దగ్గరైనట్లు తెలుస్తోంది.

Read Also: Wife Kills Husband: 23 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం.. భర్తను చంపి చెరువులో పడేసిన భార్య

BIS సర్టిఫికేషన్..
BIS జాబితాలో SM-A576B/DS అనే మోడల్ నంబర్‌తో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 31, 2025న ఆమోదం పొందింది. ఇందులోని డీఎస్ సఫిక్స్ డ్యుయల్ సిమ్ సపోర్ట్‌కు సూచనగా ఉంది. మార్కెటింగ్ పేరు BISలో వెల్లడించనప్పటికీ, శామ్‌సంగ్ మోడల్ నంబరింగ్ ప్యాటర్న్ ప్రకారం ఇది Galaxy A57 5Gగా విడుదలయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. సాధారణంగా BIS సర్టిఫికేషన్ అంటే ఫోన్ అధికారిక లాంచ్ చాలా దగ్గరలో ఉందన్న మాట. నివేదికల ప్రకారం, Galaxy A57 5Gను 2026 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది Galaxy S26 సిరీస్‌తో పాటు లేదా దాని తర్వాత విడుదల కావచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also: Sandeep Reddy Vanga: “కబీర్ సింగ్” ఆఫర్‌ను ఆ హీరో రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ నిజం చెప్పిన సందీప్‌రెడ్డి వంగా

Galaxy A37 కూడా వస్తుందా?
గెలాక్సీ A57తో పాటు Galaxy A37 మోడల్ కూడా ఒకేసారి లాంచ్ కావొచ్చని సమాచారం. ఈ ఫోన్లలో మెరుగైన కెమెరా, డిస్‌ప్లే హార్డ్‌వేర్ ఉండే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు
* Samsung Galaxy A57 5Gలో
* Exynos 1680 చిప్‌సెట్
* Xclipse 550 GPU
* Android 16 ఆపరేటింగ్ సిస్టమ్
* 12GB RAM.. అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ స్పెసిఫికేషన్లతో ఇది హై-టియర్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో నిలిచే ఫోన్‌గా భావిస్తున్నారు.

డిస్‌ప్లే & కెమెరా అప్‌గ్రేడ్స్
Galaxy A57లో ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. శామ్‌సంగ్ డిస్‌ప్లేకు తోడు TCL CSOTను రెండో డిస్‌ప్లే సరఫరాదారుగా చేర్చనున్నట్లు తెలుస్తుంది. దీని వల్ల బెజెల్స్ మరింత సన్నగా ఉండే అవకాశం ఉండటంతో పాటు ఖర్చు కూడా నియంత్రణలో ఉండవచ్చని భావిస్తున్నారు.

కెమెరా స్పెక్స్..
50MP మెయిన్ కెమెరా
13MP అల్ట్రా వైడ్ కెమెరా
5MP మ్యాక్రో కెమెరా
12MP ఫ్రంట్ కెమెరా

మొత్తంగా చూస్తే, Samsung Galaxy A57 5G భారత మార్కెట్‌లో మిడ్‌రేంజ్ విభాగంలో కీలకమైన ఫోన్‌గా మారే ఛాన్స్ ఉంది. BIS సర్టిఫికేషన్‌తో లాంచ్ మరింత దగ్గరైన నేపథ్యంలో, శామ్‌సంగ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version