Samsung Q-Series Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, హోమ్ ఆడియో విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా 2026 సంవత్సరానికి గానూ సరికొత్త ఆడియో పరికరాల లైనప్‌ను ప్రకటించింది. మెరుగైన ఇమ్మర్సివ్ సౌండ్, ఏఐ (AI) టెక్నాలజీ , వినూత్న డిజైన్‌తో కూడిన ఈ పరికరాలను జనవరి 6 నుంచి ప్రారంభం కానున్న CES 2026లో అధికారికంగా ప్రదర్శించనున్నారు. క్యూ-సిరీస్ సౌండ్‌బార్లు అంటే ఇంట్లోనే థియేటర్ అనుభూతి అని చెప్పొచ్చు. శాంసంగ్ తన పాపులర్ క్యూ-సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది.
HW-Q990H (ఫ్లాగ్‌షిప్ మోడల్): ఇది 11.1.4 ఛానల్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 7.0.2 మెయిన్ బార్, 4.0.2 రియర్ స్పీకర్లు , పవర్‌ఫుల్ సబ్‌వూఫర్ ఉన్నాయి. ఇందులో మొదటిసారిగా ‘సౌండ్ ఎలివేషన్’ (Sound Elevation) టెక్నాలజీని వాడారు. ఇది స్క్రీన్‌పై వచ్చే డైలాగులను నేరుగా మన వైపు వచ్చేలా మలచి, శబ్దాన్ని మరింత సహజంగా వినిపిస్తుంది. ఏఐ ట్యూనింగ్ ద్వారా గది ఆకృతికి తగ్గట్టుగా సౌండ్‌ను అడ్జస్ట్ చేస్తుంది.
HW-QS90H (ఆల్-ఇన్-వన్ మోడల్): ఇది ఒక కన్వర్టబుల్ డిజైన్‌తో వస్తుంది. దీనిని గోడకు తగిలించుకోవచ్చు లేదా టేబుల్‌పై ఉంచుకోవచ్చు. దీనిలోని గైరో సెన్సార్ అది ఉన్న దిశను బట్టి సౌండ్ అవుట్‌పుట్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. దీనికి ప్రత్యేక సబ్‌వూఫర్ అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే క్వాడ్ బాస్ వూఫర్ సిస్టమ్ బిల్ట్-ఇన్ చేయబడింది.
Top Tech Gadgets 2025: ఈ ఏడాది మార్కెట్‌ను షేక్ చేసిన టాప్ గ్యాడ్జెట్లు ఇవే.!
మ్యూజిక్ స్టూడియో వై-ఫై స్పీకర్లు : ప్రముఖ డిజైనర్ ఎర్వాన్ బౌరౌలెక్ రూపొందించిన ‘టైమ్‌లెస్ డాట్’ కాన్సెప్ట్‌తో మ్యూజిక్ స్టూడియో 5 , 7 మోడళ్లను శాంసంగ్ పరిచయం చేసింది.
మ్యూజిక్ స్టూడియో 7: ఇది 3.1.1 ఛానల్ స్పేషియల్ ఆడియోను అందిస్తుంది. ఇందులో ఏఐ డైనమిక్ బాస్ కంట్రోల్ ఉండటం వల్ల బాస్ చాలా లోతుగా, ఎక్కడా డిస్టార్షన్ లేకుండా వినిపిస్తుంది.
మ్యూజిక్ స్టూడియో 5: ఇది చిన్న ఇళ్ల కోసం రూపొందించబడింది. ఇది స్పష్టమైన , బ్యాలెన్స్‌డ్ సౌండ్‌ను అందిస్తుంది. వాయిస్ కంట్రోల్ , బ్లూటూత్ సదుపాయం కూడా ఉంది.
మెరుగైన క్యూ-సింఫనీ (Q-Symphony) : శాంసంగ్ తన క్యూ-సింఫనీ ప్లాట్‌ఫారమ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఒకేసారి 5 ఆడియో పరికరాలను (సౌండ్‌బార్లు , స్పీకర్లు కలిపి) శాంసంగ్ టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది గదిలోని లేఅవుట్‌ను విశ్లేషించి, సరౌండ్ సౌండ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
అధునాతన ఏఐ ఫీచర్లు , స్మార్ట్ థింగ్స్ (SmartThings) యాప్ సపోర్ట్‌తో వస్తున్న ఈ కొత్త పరికరాలు, హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయని శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ ధీమా వ్యక్తం చేశారు.
WhatsApp Scam: Happy New Year అనగానే క్లిక్ చేశారా..? డబ్బంతా మాయం!
