Site icon NTV Telugu

Royal Enfield Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్ లోకి వచ్చేది అప్పుడే?

Royal Enfield Meteor Electric Render

Royal Enfield Meteor Electric Render

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. బుల్లెట్ బండి అంటే యువతకు ఒక పిచ్చి ఉంటుంది.. ఖర్చు ఎక్కువైన పర్లేదు తగ్గేదేలే అంటున్నారు..ఫాలో అయే వారు ఎక్కువగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. యూత్‌లో ఈ బైక్స్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవం అతిశయోక్తి కాదేమో. అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ దుమ్మురేపుతూ ఉంటాయి..

ఇది ఇలా ఉండగా..రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను తయారు చేసే ఐషన్ మోటార్స్ ఓ కీలక ప్రకటన చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకు వచ్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకే కంపెనీ ఒక్క ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా తీసుకురాలేదు. అయితే తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఎప్పుడు తీసుకువచ్చేది వెల్లడించింది. ఇండియాలో వచ్చే రెండేళ్ల కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది.. ఈ విషయాన్ని కంపెనీ అధినేత స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు..

కొత్తగా ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ కోసం ఒక తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తామని, 1,50,000 యూనిట్ల కెపాసిటీతో దీన్ని స్థాపిస్తామని వెల్లడించారు. తర్వాత క్రమంగా ఈ తయారీ కెపాసిటీ పెంచుకుంటూ వెళ్లామని తెలిపారు. గురుగావ్ లో ఈ కొత్త బైక్స్ ను తయారు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిపారు..మరో వైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీ అమ్మకాలు జూలై నెలలో భారీగా పెరిగాయి. 66,062 యూనిట్లుగా నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 46,529 యూనిట్లుగా ఉన్నాయి. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 42 శాతం పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఎగుమతులు మాత్రం తగ్గాయి. 7055 యూనిట్లుగా నమోదు అయ్యాయి.. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు.. అందుకే కొత్త బైక్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు..

Exit mobile version