Site icon NTV Telugu

RIL Jio Frames: HD కెమెరా, లైవ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లతో రిలయన్స్‌ జియోఫ్రేమ్స్

Jio Frames

Jio Frames

RIL Jio Frames: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో JioFrames అనే ప్రత్యేకమైన స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేసింది. ఇవి పూర్తిగా AIతో నడిచే హ్యాండ్స్‌ఫ్రీ గ్లాసెస్. ఇందులో బిల్ట్-ఇన్ AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ముఖ్యంగా భారతీయ భాషలకు సపోర్ట్ ఇవ్వడం దీని ప్రత్యేకత. జియోఫ్రేమ్స్ సహాయంతో కాల్స్ రిసీవ్ చేయడం, ఫొటోలు తీసుకోవడం, వీడియోలు రికార్డ్ చేయడం, సంగీతం వినడం ఇలా అన్ని హ్యాండ్స్ ఫ్రీగా చేయవచ్చు. ఇందులో ఉన్న జియో వాయిస్ AI యూజర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా, వివిధ సూచనలు కూడా ఇస్తుంది. ప్రత్యేకంగా లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఉండడంతో యూజర్ అనుగుణంగా అవసరమైన వాటిని చూసిన వెంటనే ఆ కంటెంట్‌ను తమ భాషలో అనువదించుకోవచ్చు.

Medak District : మెదక్ నుంచి మక్త భూపతిపూర్ వెళ్లే రూట్లో దెబ్బతిన్న మూడు రోడ్లు

జియో Voice AI స్థానిక సంస్కృతి, ఉచ్చారణలు, సాధారణ వాడుక భాషలను అర్థం చేసుకునేలా డిజైన్ చేయబడింది. ఇది యూజర్‌కు పర్సనల్ అసిస్టెంట్‌లా పనిచేస్తూ డైలీ టాస్కులు ట్రాక్ చేయడం, మీటింగ్స్ మేనేజ్ చేయడం, రిమైండర్లు సెట్ చేయడం వంటి ఫీచర్లు అందిస్తుంది. ఇక ఈ జియోఫ్రేమ్స్‌లో HD కెమెరా అమర్చబడి ఉంటుంది. దీని సహాయంతో హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అంతేకాదు, రియల్ టైమ్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై PoV స్ట్రీమింగ్ కూడా చేయవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ స్పీకర్ ఉండటం వల్ల కాల్స్ అటెండ్ చేయడమే కాకుండా సంగీతాన్ని కూడా వినవచ్చు.

నెక్ట్స్ లెవల్ ఫీచర్లతో గ్లోబల్గా HONOR Magic V5 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

జియోఫ్రేమ్స్‌లో ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది యూజర్ అడుగులు ట్రాక్ చేసి, అవసరమైన వెల్‌నెస్ సూచనలు వాయిస్ కమాండ్స్ ద్వారా అందిస్తుంది. ఇక ఈ గ్లాసెస్ తేలికైన బరువు, సౌకర్యవంతమైన డిజైన్ వల్ల ఇవి రోజువారీ వాడుక కోసం అనువుగా తయారు చేశారు. అయితే జియోఫ్రేమ్స్ ధర, అందుబాటు విషయాలను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. చూడాలి మరి వీటి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పుడు తెలుపుతుందో.

Exit mobile version