Redmi Turbo 6 Max: రెడ్‌మీ టర్బో 6 మ్యాక్స్.. 10000mAh బ్యాటరీ, 7-ఇంచెస్ 2K డిస్‌ప్లేతో వచ్చేస్తోంది!

  • రెడ్‌మి టర్బో 6 మ్యాక్స్
  • 10000mAh బ్యాటరీ
  • త్వరలో చైనాలో విడుదల చేసే అవకాశం
Redmi Turbo 6 Max

Redmi Turbo 6 Max

Redmi Turbo 6 Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రెడ్‌మీ మరో సంచలన డివైస్‌ను తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా లీకుల ప్రకారం Redmi Turbo 6 Max పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలో చైనాలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ, 7-అంగుళాల 2K డిస్‌ప్లే, MediaTek Dimensity 9-సిరీస్ ప్రాసెసర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అయితే, కంపెనీ ఇప్పటివరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మొత్తం లీకుల ఆధారంగానే ఉంది.

10,000mAh బ్యాటరీతో కొత్త రికార్డు?

Redmi Turbo 6 Maxలో అత్యంత ఆకర్షణీయమైన అంశం 10,000mAh భారీ బ్యాటరీ. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలతో వస్తుండగా, ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. ఈ బ్యాటరీతో ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులకుపైగా సాధారణ వినియోగాన్ని అందించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

7-అంగుళాల 2K డిస్‌ప్లే

ఈ ఫోన్‌లో 7-అంగుళాల 2K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. పెద్ద స్క్రీన్ కారణంగా వీడియోలు చూడటం, గేమింగ్, మల్టీమీడియా వినియోగం మరింత మెరుగ్గా ఉండొచ్చని భావిస్తున్నారు.

శక్తివంతమైన Dimensity 9-సిరీస్ చిప్

లీకుల ప్రకారం Redmi Turbo 6 Maxలో 3nm ప్రాసెస్‌పై రూపొందించిన MediaTek Dimensity 9-సిరీస్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది అధిక పనితీరు, తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందించగలదని అంచనా.

ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మిడ్-రేంజ్ విభాగంలో అరుదుగా కనిపించే అనేక ప్రీమియం ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. వాటిలో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, మెటల్ సెంటర్ ఫ్రేమ్, IP68, IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, అంచనా స్పెసిఫికేషన్లు, డిస్‌ప్లే 7-అంగుళాల 2K స్క్రీన్, ప్రాసెసర్ MediaTek Dimensity 9-సిరీస్ (3nm), బ్యాటరీ 10,000mAh, ఫింగర్‌ప్రింట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే స్కానర్, బిల్డ్ మెటల్ ఫ్రేమ్, ప్రొటెక్షన్ IP68 + IP69 రేటింగ్.

Poco బ్రాండింగ్‌తో గ్లోబల్ మార్కెట్లోకి?

టెక్ లీకుల ప్రకారం Redmi Turbo 6 Maxను ప్రపంచ మార్కెట్లలో POCO X9 Pro Max పేరుతో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు Xiaomi లేదా Poco నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.