Redmi Turbo 5: రెడ్‌మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా

  • Redmi Turbo 5 త్వరలో భారత మార్కెట్లో
  • జూన్ 16న భారతదేశంలో అధికారికంగా విడుదల
  • MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్
Redmi Turbo 5

Redmi Turbo 5

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Redmi Turbo 5 త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. Redmi Turbo సిరీస్‌లో భారతదేశంలో విడుదల కానున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఫోన్ విడుదల తేదీతో పాటు దాని ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ వెల్లడించింది.

విడుదల తేదీ ఎప్పుడు?

Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 16న భారతదేశంలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలాగే అమెజాన్‌లో ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా ప్రారంభించింది. దీంతో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు (Black), తెలుపు (White) రంగులలో లభించనుంది.

×
×
Ad

MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్

Redmi Turbo 5లో శక్తివంతమైన MediaTek Dimensity 8500 Ultra చిప్‌సెట్‌ను అందిస్తున్నారు. కంపెనీ ప్రకారం, ఈ ప్రాసెసర్ అత్యుత్తమ పనితీరును అందించగలదు. AnTuTu బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్ సుమారు 2.3 మిలియన్ స్కోర్ సాధించినట్లు పేర్కొంది. ఫోన్‌లో 12GB LPDDR5X RAMతో పాటు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉండనుంది. అలాగే UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ వల్ల వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫర్, యాప్ లోడింగ్ అనుభవం లభించనుంది. అంతేకాకుండా, దీర్ఘకాలం గేమింగ్ లేదా హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 3D Ice-Loop Cooling System‌ను కూడా అందిస్తున్నారు.

డిస్‌ప్లే ఫీచర్లు

చైనాలో ఇప్పటికే విడుదలైన Redmi Turbo 5లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 1268×2756 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది.

120Hz రిఫ్రెష్ రేట్
480Hz టచ్ శాంప్లింగ్ రేట్
3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కెమెరా సెటప్

ఫోటోగ్రఫీ కోసం Redmi Turbo 5లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా (f/1.5), 8MP అల్ట్రా వైడ్ కెమెరా (f/2.2), సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20MP ఫ్రంట్ కెమెరా (f/2.2) అందుబాటులో ఉంది.

భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

Redmi Turbo 5లో 7,560mAh భారీ బ్యాటరీని అందించారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. అలాగే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో చాలా తక్కువ సమయంలో బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చు. పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన MediaTek ప్రాసెసర్, 120Hz AMOLED డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో Redmi Turbo 5 భారత మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా గేమింగ్, మల్టీటాస్కింగ్ ఇష్టపడే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.