IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!

  • రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ 5G గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ ..
  • 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌..
  • 50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
  • 32MP ఫ్రంట్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్
  • 10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 100W HyperChargeతో..
  • Snapdragon 6 Gen 5 ప్రాసెసర్, Adreno 812 GPUతో..
  • IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో నీరు, దుమ్ము నుంచి అధిక రక్షణ..
Redmi Note 17 Pro Max 5g

Redmi Note 17 Pro Max 5g

REDMI Note 17 Pro Max 5G: రెడ్‌మీ (REDMI) నోట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఇందులో రెడ్‌మీ నోట్ 17 ప్రో 5G (REDMI Note 17 Pro 5G), రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ 5G (REDMI Note 17 Pro Max 5G) ఫోన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా “ప్రో మాక్స్” మోడల్ లో భారీ 10,000mAh బ్యాటరీ, 100W హైపర్ ఛార్జ్, 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే, IP69K రేటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయ్యింది.

కెమెరా & బ్యాటరీ:

ఫోటోగ్రఫీ కోసం ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ లో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరాను అందించారు. దీనికి f/1.5 అపెర్చర్ ఉంది. దీంతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. వెనుక కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది కూడా 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. AI Glare Removal, AI Erase Pro వంటి AI ఆధారిత ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ ఫోన్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది10,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది కేవలం 9,210mAh సామర్థ్యంతో లభిస్తుంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసేందుకు 100W హైపర్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. అలాగే 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందించారు.

AMOLED డిస్‌ప్లే:

REDMI Note 17 Pro Max 5Gలో 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 2772×1280 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 3,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే HDR10+, Dolby Vision, 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 3200Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డిస్‌ప్లేకు Corning Gorilla Glass Victus 2 రక్షణను అందించారు. ఫోన్ మన్నికను పెంచేందుకు Redmi Titan Structureను ఉపయోగించింది. ఇందులో హై-స్ట్రెంగ్త్ మదర్‌బోర్డ్, రీ-ఇన్‌ఫోర్స్డ్ మిడ్-ఫ్రేమ్ వంటి నిర్మాణాత్మక రక్షణలు ఉన్నాయి.

Snapdragon  ప్రాసెసర్:

పనితీరు కోసం ప్రో మాక్స్ లో 4nm టెక్నాలజీపై తయారైన స్నాప్ డ్రాగన్ 6 జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. దీనికి Adreno 812 GPU జత చేశారు. 8GB, 12GB LPDDR5X RAM వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. స్టోరేజ్ పరంగా 128GB, 256GB, 512GB ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. డైనమిక్ RAM ఎక్స్‌టెన్షన్ ద్వారా గరిష్ఠంగా 24GB వరకు మెమరీని పొందే అవకాశం ఉంది. అలాగే ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లతో పాటు Xiaomi HyperAI టూల్స్ కూడా ఫోన్‌లో ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బలమైన బాడీ:

REDMI Note 17 Pro Max 5Gకు IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. 2 మీటర్ల లోతులో 72 గంటల వరకు నీటిలో మునిగిన పరిస్థితులను తట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. నీటితో తడిసిన సమయంలోనూ ఫోన్‌ను ఉపయోగించేందుకు వెట్ టచ్ టెక్నాలజీ 2.0, అండర్ వాటర్ మోడ్ వంటి ఫీచర్లు అందించారు.

ధర:

REDMI Note 17 Pro Max 5G క్లౌడ్ బ్లష్, గ్రీన్, పర్పుల్, బ్లాక్ అనే నాలుగు రంగుల్లో, నాలుగు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర USD 499 (రూ.47,670).