Redmi M100: షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి మరో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. Redmi M100 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. భారీ 7,900mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Snapdragon 4 Gen 5 చిప్‌సెట్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు. ఇందులో 6.9 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 720×1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz వరకు ఉంటుంది. డిస్‌ప్లే 675 నిట్స్ సాధారణ బ్రైట్‌నెస్, గరిష్టంగా 825 నిట్స్ గ్లోబల్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. తక్కువ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ పనితీరు కోసం TÜV Rheinland సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి.
పర్ఫార్మెన్స్ కోసం ఇందులో 4nm Snapdragon 4 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Adreno GPU ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 8GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా Xiaomi HyperOS 3పై ఫోన్ పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే Redmi M100 వెనుక భాగంలో 13MP మెయిన్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంటుంది. కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్ మోడ్, టైమ్-లాప్స్, ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Redmi M100లో అతిపెద్ద ప్రత్యేకతగా 7,900mAh బ్యాటరీను చెప్పుకోవచ్చు. దీనికి 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. అంటే అవసరమైన సమయంలో ఈ ఫోన్‌ను ఇతర డివైజ్‌లకు పవర్ అందించేందుకు ఉపయోగించుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా 5G, NFC, Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.1, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. GPS, BeiDou, Galileo, QZSS, A-GPS వంటి నావిగేషన్ సిస్టమ్స్‌కు కూడా సపోర్ట్ ఉంటుంది. వీటితోపాటు యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, వర్చువల్ డిస్టెన్స్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్ Haoyehei, Star Rain White, Wilderness Green అనే మూడు కలర్ ఆప్షన్లలో చైనాలో విక్రయానికి అందుబాటులో ఉంది. భారత్‌లో Redmi M100 విడుదలపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. చైనాలో Redmi M100 ధరలు ఇలా ఉన్నాయి:
* 6GB RAM + 256GB: CNY 1,999 (రూ.28,000).
* 8GB RAM + 128GB: CNY 1,799 (రూ.25,000).
* 8GB RAM + 256GB: CNY 2,199 (రూ.31,000).

