REDMI K100: స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థలలో ఒక్కటైన షావోమి నుండి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ REDMI K100ను చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. నెక్స్ట్ లెవెల్ గేమింగ్ అనుభవం, భారీ బ్యాటరీ లైఫ్, అత్యున్నత పనితీరును లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేశారు. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
ప్రీమియం డిజైన్ & అల్ట్రా-స్మూత్ డిస్‌ప్లే
REDMI K100 స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల 1.5K (2772×1280 పిక్సెల్స్) ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో లాంచ్ అయ్యింది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 3500 nits వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే చుట్టూ అత్యంత సన్నని బెజెల్స్‌తో పాటు 1.3 మిమీ మెటల్ మిడ్-ఫ్రేమ్ మరియు కర్వ్డ్ అంచులను అందించారు. కంటి రక్షణ కోసం DC డిమ్మింగ్, షావోమి ‘గ్రీన్ మౌంటైన్ ఐ ప్రొటెక్షన్ 4.0’ టెక్నాలజీని అమర్చారు. బ్లాక్, స్నో వైట్, ఫైర్‌ఫ్లై గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
ప్రత్యేక గేమింగ్ చిప్
ఈ ఫోన్ శక్తివంతమైన 3nm క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో Adreno 830 GPU, LPDDR5X Ultra ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. గ్రాఫిక్స్ పనితీరును మరింత మెరుగుపరచడానికి ప్రత్యేకంగా D2 గేమింగ్ డిస్‌ప్లే చిప్ ను ఇందులో చేర్చారు. ఈ సెటప్ ద్వారా 40కి పైగా గేమ్‌లను 165 fps వేగంతో ఆడుకోవచ్చు. అలాగే గేమింగ్ సమయంలో వేడి పెరగకుండా ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్, సూపర్ రిజల్యూషన్ వంటి సదుపాయాలు కల్పించారు.
10,000mAh బ్యాటరీ
ఈ స్మార్ట్ ఫోన్ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ 10,000mAh షావోమి జిన్‌షాజియాంగ్ బ్యాటరీ. ఇది సాధారణ వినియోగంలో సింగిల్ ఛార్జ్‌పై ఇది దాదాపు 2.43 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. దీనికి తోడు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకునేందుకు 27W రివర్స్ ఛార్జింగ్, గేమ్స్ ఆడుతున్నప్పుడు వేడిని తగ్గించేందుకు బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లను అందించారు.
కెమెరా & ఆపరేటింగ్ సిస్టమ్
ఫోటోగ్రఫీ విభాగంలో OIS సపోర్ట్, లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20MP కెమెరాను అమర్చారు. సెక్యూరిటీ కోసం డిస్‌ప్లే క్రింద సరికొత్త 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అంతేకాకుండా నీరు, ధూళి నిరోధకత కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో మంచి రక్షణను కలిగి ఉంది.
ధర
ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో ప్రస్తుతం ముందస్తు ఆర్డర్లకు అందుబాటులో ఉంది. అక్టోబర్ 31 నుంచి అధికారిక అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా..
* 12GB RAM + 256GB Storage: 3,499 యువాన్లు (సుమారు రూ. 49,910)
* 12GB RAM + 512GB Storage: 4,099 యువాన్లు (సుమారు రూ. 58,470)
* 16GB RAM + 512GB Storage: 4,499 యువాన్లు (సుమారు రూ. 64,180)
మొదటి అమ్మకాలలో భాగంగా కొనుగోలుదారులకు ప్రత్యేక లాంచ్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. త్వరలోనే ఈ ఫోన్ గ్లోబల్, భారత మార్కెట్లలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

