Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
- Redmi 17C 5G విడుదల
- 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi 17C 5G Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Redmi 17C 5Gను విడుదల చేసింది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 6000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, IP64 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సింగపూర్ మార్కెట్లో విడుదలైంది. ఇతర మార్కెట్లలో, ముఖ్యంగా భారత్‌లో Redmi 17C 5G లాంచ్‌పై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
Redmi 17C 5G ధర
సింగపూర్‌లో Redmi 17C 5G ధర SGD 279, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.19,000గా ఉంటుంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.. Purple, Black, Brown – Vegan Leather Finish. భారత్‌తో పాటు ఇతర మార్కెట్లలో ఈ ఫోన్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని Redmi ఇంకా వెల్లడించలేదు.
Also Read
- OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
- Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
- Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
6.9 అంగుళాల 120Hz డిస్ప్లే
Redmi 17C 5Gలో 6.9 అంగుళాల LCD డిస్ప్లే ఉంది. ఇది 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ కోసం స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే సాధారణంగా 660 నిట్స్, HBM మోడ్‌లో గరిష్ఠంగా 810 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు DC Dimming, అలాగే TÜV Rheinland సర్టిఫికేషన్ ను కూడా అందించారు.
MediaTek Dimensity 6300 ప్రాసెసర్
పనితీరు కోసం Redmi 17C 5Gలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ 4GB RAMతో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 64GB, 128GB ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. దీంతో ఫొటోలు, వీడియోలు, యాప్స్, ఇతర ఫైళ్లను ఎక్కువగా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
50MP కెమెరా
కెమెరా విషయానికి వస్తే Redmi 17C 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా – f/1.8 అపర్చర్ Auxiliary Lens అందించారు. కెమెరాలో HDR, Night Mode, Portrait Mode వంటి ఫీచర్లు ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం 30fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
6000mAh బ్యాటరీ
Redmi 17C 5Gలో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అయితే కంపెనీ రిటైల్ బాక్స్‌లో 15W ఛార్జర్ ను మాత్రమే అందిస్తోంది. పూర్తి 33W ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలంటే అనుకూలమైన ఛార్జర్ అవసరం కావచ్చు.
5G, NFCతో పాటు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లు
కనెక్టివిటీ పరంగా Redmi 17C 5Gలో పలు ఫీచర్లు ఉన్నాయి. వీటిలో Dual SIM, 5G, Wi-Fi, Bluetooth 5.4, NFC, 3.5mm Headphone Jack, FM Radio వంటివి ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ను అందించారు.
IP64 రేటింగ్
Redmi 17C 5Gకు IP64 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీటి తుంపరల నుంచి ఫోన్‌కు కొంత రక్షణ లభిస్తుంది. ఫోన్ కొలతలు 171.56 × 79.47 × 8.05mm, బరువు 211 గ్రాములుగా ఉంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!