Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
- Redmi 17 5G లాంచ్
- 7900mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Redmi 17 5G: షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 17 5Gని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ 7,900mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా, 120Hz డిస్ప్లే, Qualcomm Snapdragon 4 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
Redmi 17 5G ధర, లభ్యత
6GB + 128GB: రూ.39,999 – నెట్ ఎఫెక్టివ్ ధర రూ.23,999
8GB + 128GB: రూ.41,999 – నెట్ ఎఫెక్టివ్ ధర రూ.26,999
Also Read
- Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 10 నుంచి Amazonతో పాటు Xiaomi అధికారిక వెబ్సైట్లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే Absolute Black, Endless Blue, Eternal Orange రంగుల్లో Redmi 17 5Gని కొనుగోలు చేయవచ్చు.
6.9 అంగుళాల 120Hz డిస్ప్లే
Redmi 17 5Gలో 6.9-అంగుళాల డిస్ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే గరిష్టంగా 825 నిట్స్ HBM బ్రైట్నెస్ అందిస్తుంది. పెద్ద స్క్రీన్ కారణంగా వీడియోలు చూడటం, గేమింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్ వంటి పనుల్లో మంచి అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. ఫోన్ కొలతలు 170.12 × 78.42 × 8.8 మిమీ కాగా, బరువు 232 గ్రాములు.
Snapdragon 4 Gen 5 చిప్సెట్
పనితీరు కోసం Redmi 17 5Gలో Qualcomm Snapdragon 4 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇది ఆక్టా-కోర్ చిప్సెట్తో వస్తుంది. RAM, స్టోరేజ్ విషయానికి వస్తే 6GB/8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ అందించారు. అదనంగా RAMను వర్చువల్‌గా 16GB వరకు, స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
50MP ప్రధాన కెమెరా
ఫోటోగ్రఫీ కోసం Redmi 17 5G వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ కెమెరాకు f/1.8 అపర్చర్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీని అపర్చర్ f/2.05గా ఉంది. ఈ ఫోన్లోని ప్రధాన ఆకర్షణల్లో 7,900mAh భారీ బ్యాటరీ ఒకటి. సాధారణ వినియోగంలో ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అందించడమే దీని లక్ష్యం. బ్యాటరీ 45W Turbo Chargeకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
IP64 రేటింగ్‌తో మన్నిక
Redmi 17 5Gకు IP64 రేటింగ్ అందించారు. దీంతో దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI Face Unlock వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇతర సెన్సర్లలో వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్ వంటివి ఉన్నాయి.
5Gతో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్
కనెక్టివిటీ విషయంలో Redmi 17 5Gలో 5G, Wi-Fi, GPS, Bluetooth 5.1 వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో, USB Type-C పోర్ట్ కూడా అందించారు. సాఫ్ట్వేర్ పరంగా Redmi 17 5G Android 16 ఆధారిత Xiaomi HyperOS 3పై పనిచేస్తుంది. దీంతో కొత్త Android ఫీచర్లు, Xiaomi సాఫ్ట్వేర్ అనుభవాన్ని వినియోగదారులు పొందనున్నారు.
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?