Site icon NTV Telugu

6.9 ఇంచెస్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. 12 వేలకే Redmi 15C 5G స్మార్ట్‌ఫోన్‌!

Redmi 15c 5g Launch

Redmi 15c 5g Launch

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ షావోమికి చెందిన సబ్‌బ్రాండ్‌ ‘రెడ్‌మీ’ బడ్జెట్ లెవల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ 15సీ (Redmi 15C 5G)ని భారతదేశంలో గురువారం విడుదల చేసింది. Redmi 14C సక్సెస్ అనంతరం ఈ ఫోన్ వచ్చింది. తక్కువ ధరకే శక్తివంతమైన ఫీచర్లను కంపెనీ ఇందులో అందిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో భారీ డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరా, బిగ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారులకు రెడ్‌మీ 15సీ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఏంటో చూద్దాం.

రెడ్‌మీ 15సీ ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.12,499గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియెంట్ ధర రూ.13,999గా ఉండగా.. 8జీబీ+128జీబీ వేరియెంట్ ధర రూ.15,499గా ఉంది. ఈ ఫోన్ మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంది. అమెజాన్, షావోమి ఇండియా ఆన్‌లైన్ స్టోర్ నుంచి రెడ్‌మీ 15సీ ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 11 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ప్రస్తుతం ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చ.

రెడ్‌మీ 15సీ ఫోన్ 6.9-అంగుళాల హెచ్‌డీ+ అడాప్టివ్‌సింక్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే TUV రీన్‌ల్యాండ్ సర్టిఫైడ్‌తో వచ్చింది. అంటే మీ కంటిపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇందులో IP64 రేటింగ్‌ను ఇవ్వగా.. ఇది దుమ్ము, ధూళి, నీటి నుంచి రక్షణ ఇస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, Android 15-ఆధారిత హైపర్ఓఎస్ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

Also Read: Akhanda 2-Balakrishna: ఇదెక్కడి పిచ్చిరా మామ.. ‘మాన్షన్ హౌజ్’ మందుతో బాలయ్యకు దిష్టి!

రెడ్‌మీ 15సీ ఫోన్‌లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ సెట్‌తో మంచి ఫోటోలు తీయొచ్చు. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6000mAh బ్యాటరీని ఇచ్చారు. మీరు సుదీర్ఘ వీడియో, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కంపెనీ ప్రకారం 23 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 107 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇస్తుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 28 నిమిషాల్లో 50 శాతం చార్జ్ అవుతుంది. 10W రివర్స్ చార్జింగ్ సపోర్ట్‌ కూడా ఉంది. ఇందులో 5G, Wi-Fi, బ్లూటూత్, IR బ్లాస్టర్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. మొత్తంమీద ఈ ఫోన్ బడ్జెట్ విభాగంలో మంచి ఎంపిక చెప్పాలి.

Exit mobile version