REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్‌ప్లే, 50MP కెమెరా

Redmagic 12 Pro

Redmagic 12 Pro

REDMAGIC 12 Pro Launched: ప్రముఖ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ REDMAGIC గ్లోబల్ మార్కెట్లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ REDMAGIC 12 Proను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 8400mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 185Hz రిఫ్రెష్ రేట్ కలిగిన OLED డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా RGB లైటింగ్‌తో కూడిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు.

REDMAGIC 12 Pro ధర, సేల్ వివరాలు

REDMAGIC 12 Pro మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి.

12GB RAM + 256GB స్టోరేజ్: $949 (సుమారు రూ.89,900)
16GB RAM + 512GB స్టోరేజ్: $1,049 (సుమారు రూ.99,370)
16GB RAM + 1TB స్టోరేజ్: $1,199 (సుమారు రూ.1,13,580)

ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఎర్లీ బర్డ్ వోచర్ల విక్రయాలు నవంబర్ 12, 2026 నుంచి ప్రారంభమవుతాయి. నవంబర్ 17 నుంచి ఎర్లీ బర్డ్ యాక్సెస్ అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 18, 2026 నుంచి ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌లో 8400mAh భారీ బ్యాటరీని అందించారు. గత మోడల్ REDMAGIC 11 Proలో ఉన్న 7500mAh బ్యాటరీతో పోలిస్తే ఇది సుమారు 12 శాతం ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. భారీ బ్యాటరీతో ఎక్కువ సమయం గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ చేసే వారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

185Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లే

REDMAGIC 12 Proలో 6.85 అంగుళాల 1.5K OLED BOE X10 డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 2688 × 1216 పిక్సెల్స్. డిస్‌ప్లేలో 185Hz రిఫ్రెష్ రేట్, 960Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. అలాగే 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గేమింగ్ సమయంలో వేగవంతమైన టచ్ రెస్పాన్స్, స్మూత్ విజువల్స్ కోసం ఈ డిస్‌ప్లే ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ను అందించారు. దీనికి Adreno 850 GPU, Red Core R5 కో-ప్రాసెసర్ జతగా ఉన్నాయి.

RAM, స్టోరేజ్ వివరాలు:

12GB / 16GB LPDDR5T RAM
256GB / 512GB / 1TB UFS 4.1 స్టోరేజ్

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే Android 17 ఆధారిత REDMAGIC OS 12పై ఈ ఫోన్ పనిచేస్తుంది. గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి RGB లైటింగ్‌తో కూడిన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు. కెమెరా విభాగంలో REDMAGIC 12 Pro వెనుక భాగంలో రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు.

50MP ప్రైమరీ కెమెరా: f/1.88 అపర్చర్, OIS సపోర్ట్
50MP అల్ట్రా వైడ్ కెమెరా: f/2.2 అపర్చర్
16MP ఫ్రంట్ కెమెరా: f/2.0 అపర్చర్, అండర్ డిస్‌ప్లే కెమెరా
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డిస్‌ప్లే కింద 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లలో USB Type-C పోర్ట్, NFC, 5G NSA/SA, Dual 4G VoLTE, Wi-Fi 7, Bluetooth 6.0, GPS ఉన్నాయి. అదనంగా 3.5mm ఆడియో జాక్ కూడా ఇచ్చారు. ఆడియో కోసం Dual 1115E స్పీకర్లు, DTS Ultra సపోర్ట్, మూడు మైక్రోఫోన్లను అందించారు. ఈ ఫోన్‌కు IPX8 రేటింగ్ కూడా ఉంది.