Site icon NTV Telugu

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 512GB స్టోరేజ్, 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో Red Magic 11 Air లాంచ్

Redmi

Redmi

Red Magic 11 Air: న్యూబియా సబ్-బ్రాండ్ అయిన రెడ్ మ్యాజిక్ గ్లోబల్ మార్కెట్లో తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ Red Magic 11 Airను నిన్న ( జనవరి 29న) అధికారికంగా విడుదల చేసింది. హై-ఎండ్ గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్‌సెట్, అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీ, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ధర:
* Red Magic 11 Air ప్రారంభ ధర EUR 499 (భారత కరెన్సీలో సుమారు రూ.55,000). ఈ ధరకు 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. అదే విధంగా 16GB RAM + 512GB స్టోరేజ్ ఉన్న హైఎండ్ వేరియంట్ కూడా ఉంది. ఈ ఫోన్ Quantum Black, Stardust White కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వినియోగదారులు redmagic.gg వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

ప్రీ-బుకింగ్ ఆఫర్
* కేవలం EUR 1 (సుమారు రూ.110)తో ప్రీ-బుక్ చేస్తే EUR 30 డిస్కౌంట్
* ఒక ఉచిత గిఫ్ట్
* ఫోన్‌కు ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటాయి.
* గ్లోబల్ సేల్స్ ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి.

డిస్‌ప్లే ఫీచర్లు
* 6.85-అంగుళాల 1.5K (2688×1216 పిక్సెల్స్) డిస్‌ప్లే
* 144Hz రిఫ్రెష్ రేట్
* 95.1% స్క్రీన్-టు-బాడీ రేషియో
* Star Shield Eye Protection Technology 2.0
* 2,592Hz PWM డిమ్మింగ్
* DC డిమ్మింగ్
* SGS Low Blue Light సర్టిఫికేషన్ వంటి కళ్లకు మేలు చేసే టెక్నాలజీలు ఉన్నాయి.

Read Also: Astrology: జనవరి 30, శుక్రవారం దినఫలాలు..

గేమింగ్ స్పెసిఫికేషన్స్:
* స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్
* సొంతంగా అభివృద్ధి చేసిన RedCore R4 గేమింగ్ చిప్
* గరిష్టంగా 16GB LPDDR5x Ultra RAM
* 512GB UFS 4.1 స్టోరేజ్
* Android 16 ఆధారిత RedMagic OS 11.0పై పని చేస్తుంది.

గేమింగ్‌కు ప్రత్యేక ఫీచర్లు
* Cube Sky Engine 3.0
* 520Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో షోల్డర్ ట్రిగర్ బటన్స్
* Bypass Charging సపోర్ట్
* ఇన్‌బిల్ట్ PC Emulator

కూలింగ్ సిస్టమ్
* దీర్ఘకాలిక గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు
* ICE Cooling System
* డ్యూయల్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్స్
* ఎక్స్‌ట్రా-థిక్ ఐస్-గ్రేడ్ వేపర్ చాంబర్
* గ్రాఫిన్ కాపర్ ఫాయిల్
* Wind Chaser 4.0 టెక్నాలజీ వంటి అధునాతన హీట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందించారు.

కెమెరా వివరాలు
* 50MP ప్రైమరీ కెమెరా
* 50MP అల్ట్రా-వైడ్ కెమెరా
* ఫ్రంట్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఇది వీడియో కాల్స్ & సెల్ఫీలకు ఉపయోగపడుతుంది.

బ్యాటరీ & ఇతర వివరాలు
* భారీ 7,000mAh బ్యాటరీ
* 120W ఫాస్ట్ ఛార్జింగ్
* Bypass Charging సపోర్ట్
* పరిమాణాలు: 163.82 × 76.54 × 7.85mm
* బరువు: 207 గ్రాములు

Exit mobile version