Realme Watch 5: రియల్‌మీ వాచ్ 5 త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ వాచ్ ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇది 1.97-అంగుళాల AMOLED డిస్‌ప్లే, IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఫోన్‌కి కనెక్ట్ చేసినప్పుడు స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు ఉంటుందని సమాచారం. రియల్‌మీ వాచ్ 5లో 108 స్పోర్ట్స్ మోడ్‌లు, 300 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి.
READ ALSO: Rohit Sharma: నయా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. T20 ప్రపంచ కప్‌లో సరి కొత్త ప్రయాణం !
ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని కొత్త ల్యాండింగ్ పేజీ రియల్‌మే వాచ్ 5 రాబోయే లాంచ్‌ను నిర్థారించింది. అయితే భారతదేశంలో ఈ స్మార్ట్‌వాచ్ లాంచ్ తేదీ, ధర వివరాలు ప్రస్తుతం వెల్లడించలేదు. రియల్‌మీ వాచ్ 5 ఇప్పటికే ఫిలిప్పీన్స్, జర్మనీ వంటి ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఈ దేశాలలో వాచ్ ధర దాదాపు EUR 60 (సుమారు రూ. 6 వేలు). ఇది టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. రియల్‌మీ సాధారణ ధరల దృష్ట్యా, ఇండియా వెర్షన్ ధర కూడా అదే శ్రేణిలో ఉంటుందని సమాచారం.
రియల్‌మే వాచ్ 5 ఫీచర్లు..
రియల్‌మీ వాచ్ 5 లో 1.97-అంగుళాల AMOLED డిస్‌ప్లే (390×450 పిక్సెల్స్) 600 నిట్స్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్ అందుబాటులో ఉన్నాయి. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది, అలాగే రన్నింగ్, యోగా, బ్యాడ్మింటన్‌తో సహా 108 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. వీటితో పాటు రియల్‌మీ వాచ్ 5 SpO2 ట్రాకింగ్, హృదయ స్పందన, నిద్ర, ఒత్తిడి ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ వాచ్ 300 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. నావిగేషన్ కోసం, ఇది GPSని కలిగి ఉంది, అలాగే ఐదు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ (GNSS)కు కూడా మద్దతు ఇస్తుంది.
రియల్‌మీ వాచ్ 5 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ వాచ్ 720 నిమిషాల వరకు బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లన్నీ కూడా భారతీయ వెర్షన్‌లో సైతం అందుబాటులో ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
READ ALSO: Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి కథలో కొత్త ట్విస్ట్.. పలాష్ తల్లి సంచలన వ్యాఖ్యలు
