Realme P4 Power 5G Lunch: రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme P4 Power 5Gను నేడు ( జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు) భారత్‌లో అధికారికంగా విడుదల చేయనుంది. ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌లో ఈ పీ4 సిరీస్ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రియల్‌మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించవచ్చు.
Read Also: Antarvedi Rathayatra: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథయాత్ర..
ధర:
* రియల్‌మీ P4 పవర్ 5G ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.37,999గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా బాక్స్ ధర కంటే వాస్తవ విక్రయ ధర తక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నందున, ఈ ఫోన్ భారత్‌లో మరింత తక్కువ ధరకు లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రారంభ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులోకి వస్తే ధర మరింత తగ్గవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది. ట్రాన్స్‌సిల్వర్, ట్రాన్స్‌ఆరెంజ్, ట్రాన్స్‌బ్లూ అనే మూడు రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
స్పెసిఫికేషన్స్ & ఫీచర్లు:
* రియల్‌మీ P4 పవర్ 5Gలో Android 16 ఆధారిత Realme UI 7.0 అందించనున్నారు. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల OS అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ కి కంపెనీ హామీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 1.5K రిజల్యూషన్ కలిగిన 4D కర్వ్+ హైపర్‌గ్లో డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 1.07 బిలియన్ కలర్స్, అలాగే HDR10+ సపోర్ట్ తో రానుంది. డిస్‌ప్లే సైజ్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
Read Also: Team India Biggest Defeats: స్వదేశంలో టీమిండియాకు భారీ షాక్.. అతిపెద్ద పరాజయాల లిస్ట్ ఇదే!
భారీ బ్యాటరీ:
* ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ 10,001mAh సిలికాన్ కార్బన్ టైటాన్ బ్యాటరీ.. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 32.5 గంటల వీడియో ప్లేబ్యాక్, 932.6 గంటల స్టాండ్బై టైమ్ అందిస్తుందని రియల్‌మీ వెల్లడించింది. అదనంగా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
ప్రాసెసర్:
* రియల్‌మీ P4 పవర్ 5Gలో 4nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 7400 Ultra చిప్‌సెట్ను ఉపయోగించారు. దీంతో పాటు ప్రత్యేకంగా HyperVision+ AI చిప్ కూడా ఉంటుంది. ఈ డ్యూయల్ చిప్ డిజైన్ ద్వారా 25% మెరుగైన ఎనర్జీ ఎఫిషియెన్సీ, 300% వరకు మెరుగైన రిజల్యూషన్, 400% వరకు స్మూత్ ఫ్రేమ్ రేట్స్ అందుతాయని కంపెనీ చెబుతోంది.
కెమెరా విభాగం:
* ఫోటోగ్రఫీ కోసం ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో) ఒక అల్ట్రా వైడ్ కెమెరా, ఈ స్మార్ట్‌ఫోన్ 4K వీడియో రికార్డింగ్కు మద్దతు ఇస్తుంది.
