Site icon NTV Telugu

Realme P4 Lite: కేవలం రూ.7,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు!

Realme P4 Lite

Realme P4 Lite

Realme P4 Lite: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మే భారత్‌లో సరికొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. అదే రియల్‌మే పి4 లైట్. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ రోజంతా రావాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

READ ALSO: Prabhas: “ప్రేమలో పడాలని ఉంది”.. మనసులో మాట బయటపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్!

ధర & ఆఫర్లు ఇవే..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్ల తర్వాత ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ.9,999 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్ కలిపి మొత్తంగా ఈ ఫోన్‌పై రూ.2 వేల వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అన్ని ఆఫర్లు పోను ఈ ఫోన్ కేవలం రూ.7,999 ధరకే లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మే వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కూడా అందుబాటులో ఉంది.

అదిరిపోయే ఫీచర్లు ఇవే..
* ఇందులో 6300 mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. దీనివల్ల ఛార్జింగ్ సమస్య లేకుండా ఎక్కువ సేపు వాడుకోవచ్చు. దీనికి సపోర్ట్ ఇచ్చేలా 15W ఛార్జర్ కూడా ఇస్తున్నారు.

* 6.74 అంగుళాల HD+ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

* ఇందులో 4GB ర్యామ్, 128GB వరకు మెమరీ ఉంటుంది.

* బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఇచ్చారు.

* ఇది బీచ్ గోల్డ్, బ్లాక్, సీ బ్లూ అనే త్రీ కల్లర్స్‌లో లభిస్తుంది.

* వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్షన్ కోసం IP54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ (సైడ్ మౌంటెడ్), ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

READ ALSO: Mohammad Kaif: పాకిస్థాన్ కోచ్‌పై కైఫ్ ఫైర్.. “భారతీయుడిని కోచ్‌గా నియమించుకోండి” అంటూ సెన్సేషనల్ కామెంట్స్!

Exit mobile version