ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రాబోతుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లు మంచి టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ వచ్చేసింది.. రియల్ మీ P1 5జీ ఫోన్ ను విడుదల చేసింది.. గ్లాసీ, స్పార్క్లింగ్, ఫీనిక్స్ డిజైన్తో ఇవి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో బేస్ మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ను అందించారు.. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందిస్తుంది..
ఫీచర్స్ విషయానికొస్తే.. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్గా ఉంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్, అలాగే 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ ui 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది..
ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో రాబోతుంది..6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. హై ఎండ్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. పీకాక్ గ్రీన్, ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.. ఈరోజు ఆరు గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఫోన్ సేల్ జరుగుతుంది.. ఈనెల 22 నుంచి పూర్తి సేల్ ఇవ్వనుందని తెలుస్తుంది..
