Realme P Series: రియల్‌మీ (Realme) త్వరలోనే భారత్‌లో ‘P’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. గత ఏడాది లాంచ్ అయిన Realme P4x 5G తర్వాత అదే సిరీస్‌లో మరొ కొత్త మొబైల్ ను ఈ నెల చివర్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుంది. ఈ ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఓ ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ RMX5107 మోడల్ నంబర్‌తో ఉన్న రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ BIS అనుమతి పొందింది. ఈ ఫోన్ జనవరి చివర్లో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: 7-సీటర్ కారులో బెస్ట్ ఏదంటే..!
ఈ కొత్త Realme P సిరీస్ ఫోన్‌లో ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇది భారత్‌లో రియల్‌మీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌లలో ఇప్పటివరకు అతిపెద్ద బ్యాటరీ కావచ్చని సమాచారం. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. లీకుల ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0తో పనిచేయవచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
Maithili Thakur: ముంబైలో మైథిలి ఠాకూర్ ఎన్నికల ప్రచారం.. వెరైటీగా ఏం చేసిందంటే..!
ఈ వార్తలు నిజమైతే కొత్త Realme P సిరీస్ ఫోన్ గత ఏడాది విడుదలైన రూ.15,499 ప్రారంభ ధరతో వచ్చిన Realme P4x 5G కంటే ఎక్కువగా ఉండనుంది. Realme P4x 5Gలో 7,000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనికి 6nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 7400 Ultra ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇందులో ఉంది.
